News August 29, 2025
గ్రామ/వార్డు సచివాలయాలపై పర్యవేక్షణ

AP: గ్రామ/వార్డు సచివాలయాల పాలనపై ప్రభుత్వం పర్యవేక్షణ పెట్టనుంది. సచివాలయాల శాఖ నుంచి ఆరుగురు, డైరెక్టరేట్ నుంచి ఆరుగురిని ఫంక్షనల్ అసిస్టెంట్లుగా, 17 మంది జాయింట్ డైరెక్టర్/DLDA స్థాయి వారిని సచివాలయ శాఖ అధికారులుగా నియమిస్తారు. మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఫస్ట్ లెవల్ గెజిటెడ్ అధికారిని.. మున్సిపాలిటీల్లో ఇద్దరు అప్పిలేట్ కమిషనర్లు, ఆరుగురు జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తారు.
Similar News
News December 31, 2025
2025లో కష్టసుఖాల్లో తోడున్న వారికి ‘థాంక్స్’ చెప్పండి!

నేటితో 2025 ముగుస్తోంది. ఈ ఏడాది మనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను, కొన్ని గుణపాఠాలను ఇచ్చి ఉండొచ్చు. గెలుపులో నవ్వులు, కష్టాల్లో కన్నీళ్లు.. ఇలా ప్రతీ అనుభవం మనల్ని మరింత దృఢంగా మార్చింది. కష్టకాలంలో తోడుగా ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీని అస్సలు మర్చిపోకండి. వారికి థాంక్స్ చెప్పండి. డబ్బు, హోదా కంటే కుటుంబంతో గడిపే సమయమే ఎంతో విలువైనదని గుర్తుంచుకోండి. ఈ ఏడాది మీకు మంచి/ చెడు జరిగితే కామెంట్‌లో పంచుకోండి.
News December 31, 2025
నువ్వుల పంటలో ఆకు, కాయ తొలుచు పురుగు-నివారణ

ఈ పురుగు తొలి దశలో చిన్న చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు ఏర్పాటు చేసుకొని లోపలి నుంచి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగులు ఆకులనే కాకుండా మొగ్గలు, పువ్వులతో పాటు కాయలోని గింజలను కూడా తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటికి క్వినాల్‌ఫాస్ 20ml లేదా క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News December 31, 2025
సీరియల్ నటి ఆత్మహత్య.. కారణమిదే!

సీరియల్ నటి నందిని(26) <<18707144>>ఆత్మహత్య<<>>కు పాల్పడిన ఘటనలో సూసైడ్ లెటర్ వెలుగు చూసింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, నటన అంటే ఇష్టమని ఆమె లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మరణానికి కారణమని తెలిపారు. కాగా నందిని తండ్రి(ప్రభుత్వ ఉద్యోగి) 2023లో మరణించారు. దీంతో ఆ ఉద్యోగం చేయాలని నందినిపై కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు.


