News April 30, 2024
జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 13 వరకు ఉంటాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు. ఉ.9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. రీకౌంటింగ్‌కు 15రోజుల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించాలన్నారు. ఆన్సర్ షీట్ ఫొటో కాపీ కోసం సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాలన్నారు.
Similar News
News March 12, 2026
NTR: వరద ముప్పు నివారణకు రూ.600 కోట్లతో ప్రణాళిక

వరద ముప్పు నివారణకు రూ.600 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు సెంట్రల్ MLA బోండా ఉమ గురువారం ట్వీట్ చేశారు. ఈ నిధులతో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్లతో డ్రైనేజ్ సిస్టం అభివృద్ధి చేస్తామన్నారు. 440 కి.మీ పొడవున నిర్మించే కాలువలలో 252 కి.మీ. మేర ఇప్పటికే నిర్మాణం పూర్తైందని, వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేస్తామని ఉమ Xలో పోస్ట్ చేశారు.
News March 12, 2026
జగన్ వ్యాఖ్యలు అబద్ధం: పయ్యావుల

AP: జగన్ చేసిన విధ్వంసానికి తాము అప్పుల భారం మోస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్న జగన్ వ్యాఖ్యలు అబద్ధమని కొట్టిపారేశారు. తాము రూ.1.05 లక్షల కోట్లే అప్పు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడా తగ్గలేదని, రెవెన్యూ లోటు ముందు నుంచే ఉందన్నారు. వైసీపీ హయాంలో ఎంత దోపిడీ జరిగిందనేది రేపో, మాపో ఈడీ బయటపెడుతుందని వ్యాఖ్యానించారు.
News March 12, 2026
గ్యాస్ కొరత.. రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా!

గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ఆయిల్ మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. LPGకి ప్రత్యామ్నాయంగా 40 వేల కిలోలీటర్ల అదనపు కిరోసిన్‌ను రాష్ట్రాలకు కేటాయించినట్లు వెల్లడించింది. మరిన్ని కమర్షియల్ సిలిండర్లను రిలీజ్ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన లబ్ధిదారులకు వాటిని అందజేస్తామని తెలిపింది. హార్ముజ్‌లో 28 భారత నౌకలు సేఫ్‌గా ఉన్నాయని కేంద్రం చెప్పింది. రోజూ 50Lసిలిండర్లు సరఫరా చేస్తున్నామంది.


