News October 11, 2024

నమ్కిన్ ప్యాకెట్ల మాటున రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా

image

ఢిల్లీలో మరోసారి ₹వేల కోట్లు విలువ చేసే డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. తాజాగా నమ్కిన్ ప్యాకెట్ల మాటున సరఫరా చేస్తున్న ₹2 వేల కోట్లు విలువచేసే 200 కేజీల కొకైన్‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఇటీవ‌ల ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన‌ ₹5,620 కోట్ల విలువైన డ్ర‌గ్స్ సరఫరా ముఠాకు తాజాగా ఘటనతో సంబంధాలున్న‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. న‌లుగురిని అరెస్టు చేశారు. ప్ర‌ధాన నిందితుడు లండ‌న్ ప‌రారైన‌ట్టు తెలుస్తోంది.

Similar News

News October 11, 2024

50 ఏళ్లలో 73శాతం అంతరించిపోయిన జంతుజాలం: నివేదిక

image

1970-2020 మధ్యకాలంలో(50 ఏళ్లు) ప్రపంచంలోని జంతుజాలంలో 73శాతం అంతరించిపోయింది. ప్రపంచ వన్యప్రాణి నిధి(WWF) సంస్థ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. అడవుల నరికివేత, వేట, పర్యావరణ మార్పులు దీనికి కారణమని తెలిపింది. మంచినీటి జీవజాతులైతే ఏకంగా 85శాతం మేర తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర జీవాలకు, మనుషులకు, ప్రకృతికి కూడా ఇది చాలా ప్రమాదకర పరిణామమని హెచ్చరించింది.

News October 11, 2024

అక్టోబర్ 11: చరిత్రలో ఈ రోజు

image

1902: లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జననం
1922: ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు జననం
1942: సీనియర్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ జననం
1978: దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) జననం
1997: సినీ, నాటక, రచయిత గబ్బిట వెంకటరావు మరణం
✯ అంతర్జాతీయ బాలికా దినోత్సవం

News October 11, 2024

గాజా స్కూల్‌పై దాడి.. 28 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. నిరాశ్రయులు తలదాచుకున్న స్కూల్‌పై జరిపిన దాడిలో 28 మంది మరణించారు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతోనే ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ హమాస్ ఉగ్రవాదులు పౌర మౌలిక సదుపాయాలను దుర్వినియోగం చేస్తున్నారంది. అయితే ఇజ్రాయెల్ ప్రకటనను పాలస్తీనా ఖండించింది.