News August 22, 2025

భారత్‌కు మద్దతు.. అమెరికా మాజీ NSA ఇంట్లో తనిఖీలు

image

INDపై ట్రంప్ టారిఫ్‌లను తప్పుబట్టిన US మాజీ జాతీయ భద్రతా సలహాదారు(NSA) జాన్ బోల్టన్ ‌ఇంట్లో FBI తనిఖీలు చేపట్టింది. INDకు మద్దతు తెలిపిన మరునాడే ఇలా జరగడం గమనార్హం. తమ అధికారులు విధులు నిర్వర్తించారని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని FBI డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. తనిఖీలు జరుగుతున్నా జాన్ వెనక్కి తగ్గలేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఉక్రెయిన్-రష్యాతో భేటీలు అవుతూనే ఉంటారని విమర్శించారు.

Similar News

News August 23, 2025

సురవరం మృతిపై CM రేవంత్, KCR దిగ్భ్రాంతి

image

TG: కమ్యూనిస్ట్ అగ్ర నేత <<17489686>>సురవరం సుధాకర్ రెడ్డి<<>> మృతిపై సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురవరం మృతి యావత్ దేశానికే తీరని లోటు అని పేర్కొన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం, కోమటిరెడ్డి, రాజనర్సింహ, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.

News August 23, 2025

సురవరం రాజకీయ ప్రస్థానం ఇదే

image

CPI అగ్రనేత <<17489686>>సురవరం సుధాకర్ రెడ్డి<<>> MBNR జిల్లా కొండ్రావుపల్లిలో 1942 MAR 25న జన్మించారు. కర్నూలులో డిగ్రీ, HYD ఉస్మానియాలో LLB పూర్తి చేశారు. 1970లో AISF అధ్యక్షుడు, 1972లో AIYF అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1985, 90 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్, 1994లో డోన్ నుంచి పోటీ చేసి ఓడారు. 1998, 2004లో నల్గొండ పార్లమెంట్ నుంచి MPగా ఎన్నికయ్యారు. 2012లో CPI జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

News August 23, 2025

ఆగస్టు 23: చరిత్రలో ఈ రోజు

image

1872: ఆంధ్రరాష్ట్ర తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు జననం
1964: సంగీత దర్శకుడు SA రాజ్‌కుమార్ జననం
1968: దివంగత గాయకుడు కేకే జననం
1969: సినీ నటుడు వినీత్ జననం
1994: ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన తొలి భారత మహిళ ఆరతి సాహా మరణం
2005: MGNREGAకు పార్లమెంట్ ఆమోదం
* జాతీయ అంతరిక్ష దినోత్సవం