News October 29, 2024
స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్‌కు మద్దతు: అదానీ గ్రూప్

AP: సీఎం చంద్రబాబుతో అదానీ ఎక్స్‌పోర్ట్స్ MD రాజేష్ అదానీ, అదానీ పోర్ట్స్ సెజ్ MD కరణ్ అదానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఓడరేవులు, మైనింగ్, రింగ్‌రోడ్డు, IT, AI, టూరిజం రంగాల్లో గల అవకాశాలను సీఎంకు వివరించారు. అమరావతి పునర్నిర్మాణానికి సహకారం అందిస్తామని, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
Similar News
News March 25, 2026
కృష్ణా: ‘10’ భౌతికశాస్త్రం పరీక్షకు 98.60% హాజరు

జిల్లాలో బుధవారం నిర్వహించిన పదో తరగతి భౌతికశాస్త్రం పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 21,718 మంది విద్యార్థులకు గాను 21,411 మంది హాజరయ్యారని, 305 మంది గైర్హాజరైనట్టు విద్యాశాఖాధికారులు తెలిపారు. 98.60% మేర హాజరు శాతం నమోదైందన్నారు. డీఈఓ 9 కేంద్రాలను పరిశీలించగా జిల్లా పరిశీలకులు 6 కేంద్రాలు, జిల్లా మోనటరింగ్ కో-ఆర్డినేటర్ 7, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 42 కేంద్రాలను సందర్శించారన్నారు.
News March 25, 2026
అన్ని కాలేజీల్లో ఇక ఫేషియల్ రికగ్నిషన్ హాజరు

AP: కాలేజీకి రాకుండానే హాజరును మేనేజ్ చేద్దామనుకుంటే ఇక కుదరదు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు, లెక్చరర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేయాలని GOVT నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌తో పాటు ప్రైవేటు కాలేజీలకూ వచ్చే ఏడాది నుంచి ఇది వర్తించనుంది. రియల్ టైమ్ పర్యవేక్షణతో హాజరు శాతాన్ని పెంచడం ద్వారా ప్రమాణాలు మెరుగుపర్చనుంది. 75% హాజరుంటేనే విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది.
News March 25, 2026
రాహుల్ పర్యటన రద్దు.. కేరళంకు రేవంత్

కడుపు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కేరళం టూర్ రద్దయింది. రాహుల్‌కు బదులుగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు TG CM రేవంత్ కేరళంకు బయల్దేరారు.


