News August 17, 2025
జీఎస్టీ సంస్కరణలకు సహకరించండి: మోదీ

నెక్స్ట్ జనరేషన్ GST సంస్కరణల అమలుకు సహకరించాలని రాష్ట్రాలను ప్రధాని మోదీ కోరారు. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించామని చెప్పారు. ఈ సంస్కరణలు పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు చిన్న, పెద్ద వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తాయని ఓ కార్యక్రమంలో తెలిపారు. ఇవి సుపరిపాలనకు మరింత దోహదం చేస్తాయని, ఈ దీపావళి జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు డబుల్ బోనస్ ఇస్తుందని పేర్కొన్నారు.
Similar News
News August 18, 2025
కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. ఐదుగురు దుర్మరణం

TG: హైదరాబాద్‌లో జరిగిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రామాంతపూర్‌లోని గోకుల్ నగర్‌లో శ్రీ కృష్ణ శోభా యాత్ర నిర్వహిస్తుండగా రథానికి కరెంట్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. మృతులను శ్రీ కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్రవికాస్, రాజేంద్రరెడ్డిలుగా గుర్తించారు.
News August 18, 2025
EP-40: వీరితో శత్రుత్వం వద్దు: చాణక్య నీతి

కొంతమందితో ఎప్పటికీ శత్రుత్వం పెంచుకోకూడదని, అది ఖరీదైనదిగా మారుతుందని చాణక్య నీతి చెబుతోంది. ‘మీ పొరుగువారితో సంబంధాలు చెడితే శత్రువులుగా మారుతారు. అత్యంత సన్నిహితులతోనూ శత్రుత్వం వద్దు. మీ రహస్యాలు, బలహీనతలు బయటపడి ముప్పుగా మారవచ్చు. కుటుంబసభ్యులనూ శత్రువులుగా చేసుకోవద్దు. ప్రభావవంతమైన వ్యక్తులతోనూ శత్రుత్వం వద్దు. ఆఫీసులో సహోద్యోగులతో శత్రుత్వం పెంచుకోకూడదు’ అని చెబుతోంది. #<<-se>>#Chanakyaneeti<<>>
News August 18, 2025
మాధవ్ కౌశిక్ ఊచకోత.. 31 బంతుల్లోనే 95*

యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావరిక్స్ బ్యాటర్ మాధవ్ కౌశిక్ అరాచకం సృష్టించారు. కాన్పూర్ సూపర్‌స్టార్స్‌తో జరిగిన మ్యాచులో మాధవ్ 31 బంతుల్లోనే 95* పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అతడి ఇన్నింగ్సులో 10 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. మాధవ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 300పైన ఉండటం విశేషం. అతడి దూకుడుతో మీరట్ ఓవర్లన్నీ ఆడి 225/2 పరుగులు చేసింది. ఛేదనలో కాన్పూర్ 20 ఓవర్లలో 139/9 పరుగులకే పరిమితమైంది.