News April 2, 2025

CM రేవంత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

image

TG: MLAల అనర్హత కేసు విచారణ సందర్భంగా CM రేవంత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపఎన్నికలు రావని అసెంబ్లీలో ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ‘ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో CM ప్రకటిస్తే అది రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేయడమే. అవసరమైతే దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని CMకు హితవు చెప్పాలి’ అని స్పీకర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

Similar News

News April 3, 2025

పురుషులకూ సంతానోత్పత్తి నిరోధక మాత్రలు!

image

USA సైంటిస్టులు విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు.
ఇంతకాలం స్త్రీలకే గర్భ నిరోధక మాత్రలుండగా, ఇప్పుడు పురుషులకూ సంతానోత్పత్తి నిరోధకాలు అభివృద్ధి చేశారు. ‘YCT-529’ పేరు గల ఈ మెడిసిన్ ప్రత్యుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్లను నియంత్రిస్తుంది. ఎలుకలు, కొన్ని క్షీరదాలపై దీన్ని ప్రయోగించగా వాటి స్పెర్మ్ కౌంట్ తగ్గి సానుకూల ఫలితాలు వచ్చాయట. మెడిసిన్ వాడకం ఆపిన 6 వారాలకు తిరిగి సామర్థ్యం పొందాయి.

News April 3, 2025

ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది.
* ప్రత్యేక వాహక ప్రాజెక్టుగా పోలవరం-బనకచర్ల
* ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి డ్రోన్ కార్పొరేషన్‌ను విడదీసి స్వతంత్ర సంస్థ ఏర్పాటు
* అనకాపల్లి డీఎల్‌పురంలో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ కంపెనీకి షరతులపై క్యాపిటల్ పోర్టు అప్పగింత
* త్రీస్టార్, ఆ పైబడిన హోటళ్ల బార్ లైసెన్స్ ఫీజులు రూ.25 లక్షలకు తగ్గింపు

News April 3, 2025

సిరాజ్‌పై సెహ్వాగ్ ప్రశంసలు

image

IPLలో సత్తా చాటుతున్న GT బౌలర్ సిరాజ్‌పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. కొత్త బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నారని పేర్కొన్నారు. తిరిగి టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవాలనే కసితోనే ఆడుతున్నారని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కకపోవడం ఆయనను హర్ట్ చేసిందన్నారు. కాగా ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లో సిరాజ్ 5 వికెట్లు తీశారు.

error: Content is protected !!