News April 16, 2025

వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించలేం: సుప్రీం

image

వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు మధ్యంతర తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. అటు వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వానికి SC నోటీసులు జారీ చేసింది. కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలతో పాటు పలు ప్రశ్నలకు 2 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.

Similar News

News January 22, 2026

నల్గొండ జిల్లాలోనూ భూభారతి కుంభకోణం..!

image

నల్గొండ జిల్లాలోనూ భూభారతి కుంభకోణం వెలుగు చూసింది. జిల్లాలోని చిట్యాలలో ఆరు, గట్టుపల్ లో మూడు, నాంపల్లిలో ఒకటి, చండూరులో ఒకటి చొప్పున రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగినట్లు నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దాదాపు 11 రిజిస్ట్రేషన్లలో సుమారు నాలుగు లక్షల మేర కొల్లగొట్టినట్లు తెలుస్తుంది. వాటిపై నివేదికలను రూపొందించి సీసీఎల్ఏకు పంపించినట్లు సమాచారం.

News January 22, 2026

మూగజీవాలను చంపేవారిపై కఠిన చర్యలు: సీతక్క

image

TG: మూగజీవాలకు విషమిచ్చి చంపడం దారుణమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. పలు చోట్ల వీధికుక్కలకు విషమిచ్చి చంపిన ఘటనలు తన దృష్టికి వచ్చాయన్నారు. సమస్యకు పరిష్కారం చట్టబద్ధంగా, శాస్త్రీయంగా జరగాలని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. RRలోని యాచారంలో 100 కుక్కలకు విషమిచ్చిన ఘటన వెలుగు చూడగా, కామారెడ్డిలో కోతులను చంపిన ఘటనలో పలువురిపై కేసు నమోదైంది.

News January 22, 2026

టెన్త్, ఐటీఐతో 210 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 210 వర్క్‌మెన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ITI, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, జనరల్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: cochinshipyard.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.