News August 14, 2025
బిహార్ ఓటరు లిస్టుపై ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు

బిహార్‌లో ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది పేర్లను జిల్లాల వారీగా ప్రకటించాలని ECని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓటర్ల తొలగింపునకు గల కారణాలను వెల్లడించాలని సూచించింది. జిల్లాలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఈ వివరాలను ఉంచాలని, దీనిపై వార్తా పత్రికలు, రేడియో, SMలో ప్రకటనలు ఇవ్వాలని పేర్కొంది. AUG 19లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను AUG 22కి వాయిదా వేసింది.
Similar News
News August 14, 2025
Asia Cup: SKY లేకుండానే భారత జట్టు?

ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును మరో వారంలో ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ జపాన్ పర్యటనకు వెళ్లడం పలు సందేహాలకు తావిస్తోంది. ఆయన జపాన్‌కు వ్యక్తిగత పనులపై వెళ్లారా? లేదా ఏదైనా గాయానికి చికిత్స తీసుకునేందుకు వెళ్లారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో స్కై లేకుండానే ఆసియా కప్‌కు BCCI జట్టును ప్రకటిస్తుందనీ వార్తలొస్తున్నాయి.
News August 14, 2025
‘వార్ 2’ వచ్చేది ఈ OTTలోకేనా?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్ 2’ మూవీ ఇవాళ విడుదలైంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్ నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తుందని సమాచారం. దీనిపై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తుందని టాక్. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు.
News August 14, 2025
వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూటమిదే విజయం: మంత్రి

AP: వచ్చే ఎన్నికల్లో(అసెంబ్లీ, పార్లమెంటు) పులివెందులలో కూటమిదే విజయమని మంత్రి పార్థసారధి ధీమా వ్యక్తం చేశారు. ‘పులివెందుల ZPTC ఎన్నికల్లో TDP విజయం 2029 ఎన్నికల్లో కూటమి విజయానికి తొలి మెట్టు. YCPకి ఇది బలమైన నియోజకవర్గం. ఓటింగ్‌ను బహిష్కరించాలని ఆ పార్టీ చెప్పినా 55-65% పోలింగ్ నమోదైంది. ప్రజల్లో YCPపై ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనం. పోలీసులను జగన్ కించపరచడం సరైంది కాదు’ అని వ్యాఖ్యానించారు.