News July 10, 2025
ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు

బిహార్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల సంఘం(ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు ఆధార్, ఓటర్ ID, రేషన్ కార్డులనూ పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిటిజన్‌షిప్ నిర్ధారణకు JUN 24న ECI సబ్మిట్ చేసిన 11రకాల డాక్యుమెంట్లు కూడా సమగ్రమైనవి కాదంది. సిటిజన్‌షిప్ నిర్ధారించాల్సింది ECI కాదని పేర్కొంది. JUL 21లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంది. విచారణను JUL 28కి వాయిదా చేసింది.
Similar News
News July 11, 2025
అరుదైన ఘనత.. వరుస ఓవర్లలో 2 హ్యాట్రిక్స్

ENG సఫోల్క్ కౌంటీకి చెందిన కిశోర్ కుమార్ సాధక్ అనే 37 ఏళ్ల స్పిన్నర్ రేర్ ఫీట్ సాధించారు. UKలోనీ టూ కౌంటీస్ ఛాంపియన్‌షిప్‌లో కెస్‌గ్రేవ్‌తో జరిగిన డివిజన్ మ్యాచ్‌లో వరుసగా 2ఓవర్లలో 2హ్యాట్రిక్స్ నమోదు చేశారు. ఇప్స్‌విచ్ & కోల్చెస్టర్ తరఫున బరిలోకి దిగిన సాధక్ 6 ఓవర్లేసి 20 రన్స్ ఇచ్చి ఆరుగురిని అవుట్ చేశారు. వారిలో ఐదుగురు డకౌట్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో సాధక్ జట్టు 7వికెట్ల తేడాతో గెలిచింది.
News July 11, 2025
రష్మిక విలన్ రోల్ చేస్తోందా?

అల్లు అర్జున్-అట్లీ మూవీలో రష్మిక నటిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లని, అందులో రష్మిక ఒకరని సినీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే దీపికను హీరోయిన్‌గా పరిచయం చేశారు. మృణాల్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారని చెబుతున్నారు. మిగిలిన 3 పాత్రల్లో రష్మిక, జాన్వీ, భాగ్యశ్రీ పేర్లు వినిపిస్తున్నాయి. రష్మిక పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని, యాక్షన్ సీన్సూ చేస్తారని సమాచారం.
News July 11, 2025
నాకు ప్రాణ హాని ఉంది: ట్రంప్

ట్రంప్‌పై ఏ క్షణమైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి <<17014894>>జావద్ లారిజనీ<<>> చేసిన హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘జావద్ లారిజనీ హెచ్చరికలను బెదిరింపులుగానే భావిస్తున్నాను. నా ప్రాణాలకు హాని ఉంది అనే వార్తల్లో సందేహం లేదు. నిజానికి నేను ఏడేళ్ల వయసు నుంచే సన్ బాత్ చేయడం మానేశాను’ అని వ్యాఖ్యానించారు. ఆ సమాధానం చూస్తే ఇరాన్ హెచ్చరికలను ట్రంప్ తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.