News October 27, 2025
‘డిజిటల్ అరెస్టుల’పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. వీటిపై నమోదైన FIRలను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల విచారణ బాధ్యతను CBIకి అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం సైబర్ క్రైమ్ నిపుణులు, వసతులు కావాలంటే చెప్పాలని CBIకి సూచించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Similar News
News October 27, 2025
త్వరలో SBIలో 3,500 పోస్టుల భర్తీ!

వచ్చే 6 నెలల్లో ఎస్బీఐ 3500 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 505 పీఓ పోస్టులు ఉన్నట్లు ఎస్బీఐ డిప్యూటీ ఎండీ కిశోర్ కుమార్ వెల్లడించారు. 3వేల సర్కిల్ ఆధారిత అధికారులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా పీఓ పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు. బ్యాంక్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రిపేర్ కావొచ్చు.
News October 27, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు!

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీ మీదుగా నడిచే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు కొన్ని రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణానికి ముందు రైల్ స్టేటస్ చూసుకోవాలని సూచించింది.
* ట్రైన్స్ లిస్ట్ కోసం పైన ఫొటోలను స్లైడ్ చేయండి.
News October 27, 2025
బ్యాటింగ్ చేసేటప్పుడు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తే..

క్రికెటర్లు మైదానంలో యాక్టివ్‌గా ఉంటారు కాబట్టి శరీరంలోని అధిక శాతం నీరు చెమట రూపంలోనే బయటకు వెళ్తుంది. ఒకవేళ బ్యాటింగ్ చేస్తుండగా యూరిన్ వస్తే ఇన్నింగ్స్ మధ్యలో వచ్చే డ్రింక్స్ బ్రేక్‌లో వెళ్లి రావచ్చు. మరీ అర్జెంట్ అయితే అంపైర్ పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఫీల్డర్లకు టాయిలెట్ వస్తే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ వస్తాడు కాబట్టి వారికి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు.


