News August 2, 2024
ఎలక్టోరల్ బాండ్లపై విచారణకు సుప్రీం కోర్టు ‘నో’

ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌పై విచారణ కోసం SIT ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇందులో ప్రభుత్వాలు-ప్రైవేటు కంపెనీల మధ్య క్విడ్ ప్రో కో(ఇచ్చి పుచ్చుకోవడం) జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పథకంలో భాగంగా దేశంలోని పలు పార్టీలకు ప్రైవేటు సంస్థలు భారీగా విరాళాలు ఇచ్చిన విషయం వెలుగులోకి రావడంతో ఈ ఆరోపణలు మొదలయ్యాయి.
Similar News
News September 18, 2025
‘మార్కో’ సీక్వెల్‌కు ఉన్ని ముకుందన్ దూరం!

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘మార్కో’కు సీక్వెల్ రానుంది. ‘లార్డ్ మార్కో’గా రానున్న ఈ చిత్రంలో హీరోగా ఉన్ని ముకుందన్ నటించట్లేదని సినీ వర్గాలు తెలిపాయి. వేరే హీరోతో ఈ మూవీని తెరకెక్కిస్తారని పేర్కొన్నాయి. ‘మార్కో’పై వచ్చిన నెగిటివిటీ కారణంగా పార్ట్-2 చేసేందుకు ఆసక్తి లేదని గతంలోనే ఉన్ని తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’లో లీడ్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
News September 18, 2025
చేతిలో బిట్ కాయిన్‌తో ట్రంప్ విగ్రహం

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్‌తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<