News October 9, 2025
గ్రూప్1 నియామకాలపై జోక్యానికి సుప్రీం నో

తెలంగాణలో గ్రూప్1 నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఇదే అంశంపై ఈనెల 15న హైకోర్టులో విచారణ ఉన్న సమయంలో తాము ఇందులో జోక్యం చేసుకోబోమని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. కాగా హైకోర్టు తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని ప్రకటించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యర్థులను సెలక్ట్ చేసింది.
Similar News
News October 9, 2025
BC రిజర్వేషన్లు: హైకోర్టులో వాదనలు ఇలా..

TG: BCలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై HCలో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తరఫున AG సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. BC కులగణన చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని చెప్పారు. డోర్2డోర్ సర్వేకు అన్ని పార్టీలూ మద్దతిచ్చినట్లు తెలిపారు. సర్కార్ నియమించిన సీనియర్ లాయర్ సింఘ్వీ వర్చువల్‌గా వాదిస్తున్నారు.
News October 9, 2025
రేపటి నుంచి వైద్య సేవలు బంద్

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో రేపటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆసుపత్రులు తెలిపాయి. ప్రభుత్వం నుంచి రూ.2,700 కోట్లు రావాలని పేర్కొన్నాయి. గత రెండు రోజులుగా ప్రజాప్రతినిధులను కలిశామని వెల్లడించాయి. తమ ఆందోళన కారణంగా సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్లు తెలిపాయి.
News October 9, 2025
ఫింగర్‌ప్రింట్ ద్వారా UPI పేమెంట్స్.. ఎలా చేయాలంటే?

UPI చెల్లింపుల కోసం PINకు <<17940744>>బదులు <<>>ఫింగర్‌ప్రింట్స్ & ఫేస్ రికగ్నిషన్ వాడటం ఆప్షన్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఇది అన్ని UPI యాప్‌లలోకి (Google Pay, PhonePe, Paytm), బ్యాంకులకు దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. UPI యాప్ సెట్టింగ్స్‌లో ‘Biometric Authentication’ ఆప్షన్‌ను ‘Enable’ చేయండి. biometricsకు లింక్ చేయాలి. అంతే.. PIN, బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు.