News March 21, 2025

యశ్వంత్ వర్మపై విచారణకు సుప్రీం ఆదేశం

image

ఢిల్లీ హైకోర్టు జడ్జి <<15834106>>యశ్వంత్ వర్మ<<>> ఇంట్లో భారీగా నగదు బయటపడిన వ్యవహారంపై సుప్రీం కోర్టు అంతర్గత విచారణకు ఆదేశించింది. హైకోర్టు సీజే నుంచి నివేదిక కోరింది. వర్మ నివాసంలో రూ.50కోట్ల వరకు నగదు బయటపడినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ డబ్బంతా ఎవరిదన్న కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. కాగా వర్మపై ఇప్పటికే బదిలీ వేటు పడింది.

Similar News

News January 20, 2026

భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం

image

<<18887766>>WEF<<>>లో ట్రంప్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఏడుగురు భారతీయ పారిశ్రామికవేత్తలు ఉండటం గమనార్హం. వీరిలో టాటా సన్స్ ఛైర్మన్‌ చంద్రశేఖరన్, భారతీ Airtel ఛైర్మన్ సునీల్ మిట్టల్, విప్రో CEO శ్రీనివాస్ పల్లియా, ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఛైర్మన్ సంజీవ్, మహీంద్రా గ్రూప్ CEO అనీష్ షా, జూబిలెంట్ గ్రూప్ కో-ఛైర్మన్ భర్తియా ఉన్నారు. ఆరేళ్ల తర్వాత ట్రంప్ WEFలో పాల్గొంటున్నారు.

News January 20, 2026

సభలో కూర్చున్నప్పుడే MPల అటెండెన్స్: స్పీకర్

image

లోక్‌సభ సభ్యుల అటెండెన్సును వారు సభలో కూర్చున్నప్పుడే తీసుకోనున్నామని స్పీకర్ ఓం బిర్లా మీడియాకు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు హౌస్ బయట హాజరు వేసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే సభ ముగిసిన, ఏదైనా కారణంతో అర్థాంతరంగా వాయిదా పడిన తర్వాత హాజరు వేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హాజరు నమోదుకు సభ్యుల సీట్ల వద్ద కన్సోల్‌ పరికరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News January 20, 2026

ఫైర్ సేఫ్టీ సంస్థలకు లైసెన్స్‌ల జారీకి కఠిన నిబంధనలు

image

TG: థర్డ్ పార్టీ ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ ఆడిటర్లు, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంటిగ్రేటర్లకు లైసెన్స్‌ల జారీ రూల్స్‌ను ప్రభుత్వం కఠినం చేసింది. ఈమేరకు GO జారీ చేసింది. వీరికి ఉండాల్సిన అర్హతలనూ నిర్దేశించింది. ఫైర్ సేఫ్టీ రూల్స్‌ను వివరిస్తూ అవి కచ్చితంగా అమలు కావలసిందేనని స్పష్టం చేసింది. బహుళ అంతస్తుల భవనాలకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ల జారీలో రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది.