News April 3, 2025
ప్రభుత్వంపై సుప్రీం ప్రశ్నల వర్షం

TG: కంచ భూముల్లో చెట్ల నరికివేతపై స్టే <<15980464>>విధిస్తూ <<>>సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘చెట్ల కొట్టివేతను సుమోటోగా చేపట్టాం. హైకోర్టు రిజిస్ట్రార్ స్పాట్‌కి వెళ్లి రిపోర్ట్ ఇచ్చారు. అటవీ ప్రాంతంలో చెట్లు ఎందుకు తొలగించారు? 100 ఎకరాలు ధ్వంసం చేసినట్లు నివేదిక వచ్చింది. ఇంత హడావుడిగా ఎందుకు చేపట్టారు? అనుమతులు తీసుకున్నారా?’ అని కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 16లోగా నివేదిక ఇవ్వాలని GOVTను ఆదేశించింది.
Similar News
News November 18, 2025
ఇవాళ భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు APSDMA తెలిపింది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని పేర్కొంది. మరోవైపు ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు.

ఢిల్లీ పేలుడు: హమాస్ తరహా దాడికి ప్లాన్?

ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కారు బ్లాస్ట్‌కు ముందు టెర్రరిస్టులు భారీ దాడికి కుట్ర చేసినట్లు NIA దర్యాప్తులో వెల్లడైంది. డ్రోన్లను ఆయుధాలుగా మార్చేందుకు, రాకెట్లను తయారు చేసేందుకు యత్నించారని తేలింది. 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి తరహాలో అటాక్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయిన ఉగ్ర అనుమానితుడు డానిష్ ద్వారా ఈ వివరాలు తెలిసినట్లు సమాచారం.