News September 15, 2025

వక్ఫ్ చట్టాన్ని సస్పెండ్ చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరణ

image

వక్ఫ్ చట్టాన్ని సస్పెండ్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే పలు సెక్షన్లపై స్టే విధించింది. ఆస్తిని వక్ఫ్‌కు అంకితం చేయాలంటే కనీసం ఐదేళ్లు ఇస్లాంను ఆచరించాలనే నిబంధనను తాత్కాలికంగా నిలిపివేసింది. 1932 నుంచి ఇప్పటివరకు వక్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించామని, మొత్తం చట్టాన్ని నిలిపివేయడానికి తగిన ఆధారాలు లేవని CJI గవాయ్ పేర్కొన్నారు. అరుదైన సందర్భాల్లోనే చట్టాల అమలును నిలిపివేస్తామన్నారు.

Similar News

News September 15, 2025

రాయలసీమ కోనసీమ అవుతోంది: సీఎం

image

AP: రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో మంచి ఫలితాలు సాధించామని, ఇప్పుడది కోనసీమగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని తెలిపారు. హంద్రీనీవా కాలువతో కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లామన్నారు. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని కలెక్టర్లకు సూచించారు.

News September 15, 2025

పాక్‌పై గెలిచాక భార్యతో SKY సెలబ్రేషన్స్

image

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి హోటల్‌కు తిరిగి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌కి తన భార్య దేవిషా శెట్టి నుంచి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన బర్త్‌డే కావడంతో స్పెషల్ కేక్‌ కట్ చేయించారు. అంతేకాదు ఆయన నుదురుపై కేకు తిలకం దిద్దారు. దీనికి సంబంధించిన ఫొటోలను దేవిషా తన ఇన్‌స్టా అకౌంట్‌లో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే మై స్పెషల్ వన్’ అని రాసుకొచ్చారు.

News September 15, 2025

సీఎం రేవంత్ వద్దకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పంచాయతీ!

image

TG: ప్రైవేట్ కాలేజీల బంద్ పంచాయితీ సీఎం రేవంత్ వద్దకు చేరింది. ఈ విషయమై సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయినట్లు తెలుస్తోంది. నిన్నటి సమావేశ సారాంశం, కాలేజీ యాజమాన్యాల డిమాండ్లను మంత్రులు సీఎంకు వివరించారని సమాచారం. దీంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ప్రకటన చేసే ఆస్కారముందని కాలేజీ యాజమాన్యాలు భావిస్తున్నాయి.