News February 3, 2025

కుంభమేళా భక్తుల భద్రతపై పిల్.. తిరస్కరించిన సుప్రీం

image

మహా కుంభమేళాకు హాజరయ్యే భక్తుల భద్రత కోసం నిర్దిష్ట మార్గదర్శకాలను కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, అయితే దీనిపై ఇప్పటికే అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైందని UP ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Similar News

News February 3, 2025

సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్: అశ్వినీ వైష్ణవ్

image

TG: కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కొన్ని పనులకు అనుమతులు కావాలని, అందుకే ఆలస్యం అవుతోందని చెప్పారు. ‘సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో 1,026 కి.మీ. మేరకు కవచ్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రం నుంచి 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయింది’ అని చెప్పారు.

News February 3, 2025

ప్రభాస్ ‘కన్నప్ప’ లుక్‌పై ట్రోల్స్

image

కన్పప్పలో ప్రభాస్ లుక్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డార్లింగ్ లుక్ ‘జగద్గురు ఆదిశంకర’ సినిమాలో నాగార్జున లుక్‌ను పోలి ఉందని పలువురు పోస్టులు చేస్తున్నారు. విగ్ సెట్ అవలేదని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా లుక్‌పై ఫోకస్ చేయాలని మంచు విష్ణుకు సూచిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి ప్రభాస్ లుక్‌పై మీ కామెంట్?

News February 3, 2025

పోలీసుల ముందే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు: రోజా

image

AP: కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ‘కూటమి నేతల అరాచకాల్ని ఖండిస్తున్నాం. తిరుపతిలో మేయర్ ఎన్నిక సందర్భంగా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. పోలీసుల ముందే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. మీరు నిజంగా ప్రజా మద్దతుతో గెలిచి ఉంటే ఇలా చేయాల్సిన అవసరం ఉందా? ఈ ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని హెచ్చరించారు.