News October 13, 2025
ఓట్ చోరీ ఆరోపణలపై పిల్.. తిరస్కరించిన సుప్రీం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై దాఖలైన PILను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఓట్ చోరీ అంశంపై దర్యాప్తుకు SIT ఏర్పాటు చేయాలన్న అడ్వకేట్ రోహిత్ పాండే విజ్ఞప్తిని తిరస్కరించింది. దీనిపై ECని పిటిషనర్ సంప్రదించవచ్చని చెప్పింది. అయితే ఎలక్షన్ కమిషన్‌ను గతంలో ఆశ్రయించినా చర్యలు తీసుకోలేదని ఆయన బదులిచ్చారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలని సూచిస్తూ PILను SC డిస్మిస్ చేసింది.
Similar News
News October 13, 2025
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు విధించిన స్టేను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించింది. ఇదే విషయమై సీనియర్ లాయర్లతో రేవంత్ భేటీ కానున్నారు. కోర్టులో వాదించాల్సిన అంశాలపై వారితో చర్చించనున్నారు.
News October 13, 2025
చిన్న చిన్న కాంట్రాక్టుల కోసం ఆశపడను: మంత్రి పొంగులేటి

TG: మంత్రి కొండా సురేఖతో <<17994511>>విభేదాలంటూ<<>> జరుగుతున్న ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ‘చిన్న చిన్న కాంట్రాక్టుల కోసం ఆశపడను. నాపై కొండా సురేఖ ఫిర్యాదు చేశారని అనుకోవడం లేదు. ఈరోజు పర్యటనకు ఆమె రాకపోవడానికి చెప్పుకోదగ్గ కారణాలేవీ లేవు. అందరూ అన్ని సార్లు ఉండాలనేం లేదు. వచ్చే పర్యటనలో అక్కలు అందరూ ఉంటారు’ అని మేడారం పర్యటనలో వ్యాఖ్యానించారు.
News October 13, 2025
సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు హెల్త్ చెకప్‌లు: సీఎం రేవంత్

TG: సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ‘విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తేవాలి. భోజనం క్వాలిటీ చెక్ చేసేందుకు టెక్నాలజీ వాడాలి. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలి. హాస్టళ్లను మెడికల్ కాలేజీలు, CHCతో లింక్ చేయాలి’ అని సూచించారు.