News May 17, 2024
మారిటల్ రేప్‌పై కేంద్ర వైఖరి కోరిన సుప్రీంకోర్టు

కొత్త క్రిమినల్ చట్టాల్లోనూ మారిటల్ రేప్‌ను మినహాయించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో AIDWA పిల్ దాఖలు చేసింది. దీనిపై కేంద్ర వైఖరిని వెల్లడించాలంటూ CJI జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. వైవాహిక అత్యాచారాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలంటూ ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో పాటుగా జులైలో వాదనలు వింటామన్నారు. కాగా 18ఏళ్లు నిండిన భార్యతో లైంగిక సంబంధాన్ని రేప్‌గా పరిగణించలేమని భారతీయ న్యాయ సంహితలోనూ పేర్కొన్నారు.
Similar News
News February 11, 2026
SBI సరికొత్త రికార్డు!

బ్యాంకింగ్ దిగ్గజం SBI సరికొత్త రికార్డు సృష్టించింది. మార్కెట్ విలువలో తొలిసారి ₹10 లక్షల కోట్ల మార్కును దాటింది. రిలయన్స్, HDFC, ఎయిర్‌టెల్, TCS, ICICI బ్యాంక్ తర్వాత ఈ ఘనత అందుకున్న ఆరో కంపెనీగా నిలిచింది. అత్యంత విలువైన కంపెనీల్లోనూ ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు SBI షేరు నిన్న ₹1,154తో ఆల్ టైమ్ హై అందుకుంది. ఏడాదిలో 67.5% ఎగిసింది. ఇందులో వాటాలున్న LICకి ₹40 వేల కోట్ల లాభం రావడం గమనార్హం.
News February 11, 2026
మనస్సును ప్రశాంతంగా మార్చే భైరవీ ముద్ర

సుఖాసనంలో కానీ పద్మాసనం/వజ్రాసనంలో కూర్చోవాలి. నడుం వంగకుండా నిటారుగా ఉండేలా చూడాలి. రెండు చేతులను ఒళ్లో ఉంచి ఒక అరచేతిలో ఇంకో అరచేయి పెట్టి ఉంచాలి. కుడి చేయి పైన , ఎడమ చేయి కింద ఉండేవిధంగా చూసుకోవాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాసతీసుకుని వదులుతూ శ్వాసమీద ధ్యాసను ఉంచాలి. కనీసం 7నిమిషాల సమయం ఈ భైరవి ముద్రలో ఉంటే మనస్సు ప్రశాతంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
News February 11, 2026
మొక్కజొన్నను ఆశించే తెగుళ్లు – నివారణ

మొక్కజొన్న నాటిన 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ml, ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. నల్లులు ఆశించకుండా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నల్లులు ఆశిస్తే లీటరు నీటిలో డైకోఫాల్ 50mlను కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1ml వేప నూనెను 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి.


