News August 14, 2024
బీసీసీఐ-బైజూ సెటిల్మెంట్పై సుప్రీం కోర్టు స్టే

బైజూస్‌కు, బీసీసీఐకి మధ్య రూ.158.9 కోట్లకు సెటిల్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. సెటిల్మెంట్ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్(NCLAT) ఆమోదించడాన్ని సవాలు చేస్తూ అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం NCLAT నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తదుపరి నోటీసులిచ్చేవరకూ సెటిల్మెంట్ డబ్బును బ్యాంకు ప్రత్యేక ఖాతాలో ఉంచాలని స్పష్టం చేసింది.
Similar News
News November 28, 2025
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News November 28, 2025
సెబీలో పెరిగిన పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

సెబీలో 110పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా 135కు పెంచారు. జనరల్ విభాగంలో 56 పోస్టులకుగాను 77కు, రీసెర్చ్ విభాగంలో 4 ఉండగా.. 8కి పెంచారు. మిగిలిన విభాగాల్లో పోస్టులను పెంచలేదు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ / PG డిప్లొమా, LLB, BE/B.Tech, CA, CFA, MCA, MSC(CS), MA( హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: sebi.gov.in
News November 28, 2025
ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా?

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంలో అక్కడి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ఆయన 845 రోజులుగా నిర్బంధంలోనే ఉండగా.. గత నెల నుంచి ఆయనను ఎవరూ కలవకుండా ‘డెత్ సెల్’లో వేశారు. ఇమ్రాన్‌ను చంపడం వల్లే ఎవరినీ అనుమతించడం లేదని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. కానీ అలాంటిదేమీ లేదని పాక్ ప్రభుత్వం బుకాయిస్తోంది. అలాంటప్పుడు ఆయనను బయటి ప్రపంచానికి చూపించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.


