News October 10, 2025

కాఫ్ సిరప్ డెత్స్‌పై పిల్.. కొట్టేసిన సుప్రీంకోర్టు

image

దగ్గు మందు తాగి 20మందికి పైగా చిన్నారులు చనిపోయిన ఘటనపై దాఖలైన పిల్‌ను SC కొట్టేసింది. CBI దర్యాప్తు చేయాలని, డ్రగ్ సేఫ్టీపై రివ్యూ నిర్వహించాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మెహతా అభ్యంతరం తెలిపారు. ఆయా రాష్ట్రాలు ఈ కేసు విచారణ జరుపుతున్నాయని చెప్పారు. CBIతో దర్యాప్తు అవసరం లేదన్నారు. దీంతో CJIతో కూడిన ధర్మాసనం పిల్‌ను డిస్మిస్ చేసింది.

Similar News

News October 10, 2025

గర్భిణులు, తల్లులకు అలర్ట్!

image

గర్భధారణ నుంచి రెండేళ్ల వరకు తల్లులకు, పిల్లల మొదటి 1,000 రోజుల్లో వారికి అదనంగా చక్కెర అందించొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ‘తక్కువ చక్కెర తీసుకునే చిన్నారులలో జ్ఞాపకశక్తి& ఏకాగ్రత మెరుగ్గా ఉంటాయి. పెద్దయ్యాక షుగర్, BP ప్రమాదం తగ్గుతుంది. తల్లి తీసుకునే పోషకాహారం బిడ్డ భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్మిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
* ప్రతిరోజూ మహిళల కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>>పై క్లిక్ చేయండి

News October 10, 2025

సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్

image

TG: రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ.20కోట్లు.. ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ.10కోట్ల నిధులు రిలీజ్ చేశారు. సొసైటీ సెక్రటరీకి ఫండ్ వినియోగించే అధికారం కల్పించారు. సొసైటీల స్థాయిలోనే హాస్టళ్లలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.

News October 10, 2025

ADR తప్పుడు అఫిడవిట్లపై సుప్రీం అసంతృప్తి

image

AP: బిహార్‌ SIRపై దాఖలైన కేసులో లాయర్ ప్రశాంత్ భూషణ్ సమర్పించిన అఫిడవిట్లపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పేర్లు తొలగించారంటూ అఫిడవిట్లో పేర్కొన్నవారు సరైన పత్రాలు అందించలేదని ECI న్యాయవాది ద్వివేది తెలిపారు. ఇలాంటివి మరిన్ని ఉన్నాయని, వెరిఫై సాధ్యం కాదని ప్రశాంత్ భూషణ్ సమర్థించుకోబోయారు. అయితే తమకు సమర్పించే ముందే పరిశీలించాల్సిన బాధ్యత లేదా అని ప్రశాంత్, ADRలను కోర్టు ప్రశ్నించింది.