News April 11, 2025

‘వక్ఫ్’పై ఈ నెల 16 నుంచి సుప్రీం విచారణ

image

వక్ఫ్ సవరణ బిల్లును సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను సుప్రీం కోర్టు ఈ నెల 16న విచారించనుంది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్, డీఎంకే పార్టీ నేత రాజా, ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణను 13వ అంశంగా కోర్టు లిస్ట్ చేసింది. మరోవైపు తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఆదేశాలు జారీ చేయొద్దని కోరుతూ కేంద్రం సుప్రీంలో కేవియట్ పిటిషన్ వేసింది.

Similar News

News November 24, 2025

సొసైటీల ద్వారా రైతులకు మెరుగైన సేవలు: కలెక్టర్

image

MHBD జిల్లాలో PACS ద్వారా రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. దంతాలపల్లి, పెద్ద వంగర, కంబాలపల్లి, అప్పారాజుపల్లి, గంగారంలో కొత్త సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వీటిలో రాష్ట్రస్థాయి కమిటీ మూడు సొసైటీలకు ఆమోదం తెలిపిందని, మిగిలిన వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.

News November 24, 2025

ఐబొమ్మ రవి.. విచారణలో సంచలన విషయాలు!

image

ఐబొమ్మ రవి మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ కలిగి ఉన్నాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇవాళ అతడి మాజీ భార్యనూ పోలీసులు విచారించారు. తనతో పాటు కూతురిని చిత్రహింసలకు గురిచేశాడని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. రవి ప్రవర్తన నచ్చకనే విడాకులు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారని వార్తలు వస్తున్నాయి. స్నేహితుడు నిఖిల్‌కు నెలకు రూ.50వేలు ఇచ్చి ఐబొమ్మ సైట్ పోస్టర్లు డిజైన్ చేయించుకున్నట్లుగా గుర్తించారు.

News November 24, 2025

కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CM

image

AP: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే’ అని స్పష్టం చేశారు.