News September 20, 2024
సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్

భారత సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్‌కు గురైంది. ఇందులో అమెరికాకు చెందిన రిపిల్ అనే డిజిటల్ చెల్లింపుల సంస్థకు సంబంధించిన XRP, క్రిప్టో కరెన్సీ ప్రమోషన్ వీడియోలను హ్యాకర్లు పోస్టు చేశారు. కేసుల విచారణను ప్రసారం చేసేందుకు ఈ యూట్యూబ్ ఛానల్‌ను సుప్రీం కోర్టు వినియోగిస్తోంది.
Similar News
News March 5, 2026
ఇంగ్లండ్ దూకుడు.. భారత్ గెలుస్తుందా?

T20 WC సెమీస్-2లో ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. భారత్ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిక్సర్లతో విరుచుకుపడుతోంది. వెంటవెంటనే 4 వికెట్లు కోల్పోయినా జాకబ్ బెథెల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 28 బంతుల్లోనే 65* పరుగులు చేశారు. విల్ జాక్స్ 19 బంతుల్లోనే 35* రన్స్ కొట్టారు. ఇంకా 42 బంతుల్లో 94 పరుగులు చేయాల్సి ఉంది. 13 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 160-4.
News March 5, 2026
భర్త జీతం నుంచి నేరుగా భార్య ఖాతాకు భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కూతురితో జీవిస్తున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలు పాటించని భర్తకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రతి నెలా అతని జీతం నుంచి ₹25Kను నేరుగా భార్య ఖాతాలో జమ చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అతను 2022 నుంచి భార్య నుంచి విడిగా ఉంటూ భరణం ఇవ్వట్లేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా ‘భరణం దాతృత్వం కాదని, భార్య, పిల్లలు గౌరవంగా జీవించడానికి ఉద్దేశించిన చట్టపరమైన హక్కు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
News March 5, 2026
సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్!

అస్సాంలో సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం గల్లంతయింది. జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన జెట్ 7.42PM సమయంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. పైలట్ కూడా మిస్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. IAF సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే ఫైటర్ జెట్ కూలిపోయిందని వార్తలు వస్తున్నాయి.


