News October 1, 2024
సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సరికాదు: పురందీశ్వరి

AP: తిరుమల లడ్డూ అంశంలో సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి తప్పుపట్టారు. ‘రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపై అయినా మాట్లాడతారు. లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు. చంద్రబాబు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ధర్మాసనం కామెంట్స్ చేయడం సరికాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 11, 2025
జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష తేదీలు ఖరారు

ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. పేపర్-1 పరీక్షలను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 8న మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరగనుంది. బీఆర్క్ సీట్లకు పేపర్-2ఎ, బి-ప్లానింగ్ సీట్లకు పేపర్-2బి పరీక్షలను ఏప్రిల్ 9న ఉదయం విడతల నిర్వహించనున్నారు. పేపర్-1 ఫలితాలను ఏప్రిల్ 17వరకు వెల్లడిస్తారు.
News March 11, 2025
హీరోకు గాయం.. మరింత ఆలస్యం కానున్న ‘వార్-2’!

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వార్-2’ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. ఈ చిత్రంలో స్టార్ హీరోల మధ్య ఓ సాంగ్ ప్లాన్ చేయగా తాజాగా రిహార్సల్స్లో హృతిక్ గాయపడినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మేలో ఈ పార్ట్ షూట్ చేస్తారని సమాచారం. దీంతో విడుదలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
News March 11, 2025
2027 నాటికి భారత్లో భారీగా ఏఐ నిపుణుల కొరత

వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఎదిగేందుకు భారత్ సిద్ధంగా ఉందని బెయిన్ అండ్ కంపెనీ అంచనా వేసింది. అయితే దేశంలో ఏఐ నిపుణుల కొరత పెరుగుతోందని తెలిపింది. 2027 నాటికి 10 లక్షలకు పైగా నిపుణుల కొరత ఉండొచ్చని అభిప్రాయపడింది. మరోవైపు ఉద్యోగ అవకాశాలు 23 లక్షలు దాటొచ్చని పేర్కొంది. ఏఐకి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉందని తెలిపింది.