News February 12, 2025
ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్

ఎన్నికల్లో ఉచిత హామీలు ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించింది. డబ్బు, ఆహారం రావడంతో ఏ పని చేయడానికీ ఇష్టపడట్లేదని పేర్కొంది. పనిచేయకుండానే డబ్బులు వస్తుండటంతో ఇలా జరుగుతుందని తెలిపింది. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే పిటిషన్‌పై విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
Similar News
News December 9, 2025
భూసమస్యలకు ఇక JCలదే బాధ్యత: అనగాని

AP: జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ‘గత పాలకుల పాపాలను కడిగేందుకు కృషి చేయడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాం. అన్ని జిల్లాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే జాయింట్ కలెక్టర్లు పనిచేయాలని CM స్పష్టం చేశారు. JCలు లేని జిల్లాలకు వెంటనే నియమించాలన్నారు. ఇకపై భూసమస్యలన్నింటికీ JCలదే బాధ్యత’ అని తెలిపారు.
News December 9, 2025
మరికొన్ని గంటల్లో బంద్.. నివారణకు ప్రభుత్వం చర్యలు

AP: అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో సరకు రవాణా లారీలు బంద్ పాటించనున్నాయి. దీన్ని ఆపేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. లారీ ఓనర్ల అసోసియేషన్ నేతలతో రవాణాశాఖ కమిషనర్ కాసేపట్లో భేటీ కానున్నారు. బంద్ నిర్ణయాన్ని విరమించాలని కోరనుండగా, దీనిపై నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. 13-20ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్‌నెస్ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ లారీ యజమానులు బంద్ చేయనున్నారు.
News December 9, 2025
వరల్డ్ టాప్ డిఫెన్స్ కంపెనీల జాబితాలో HAL

వరల్డ్ TOP-100 డిఫెన్స్ కంపెనీల జాబితాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 44వ స్థానంలో నిలిచింది. BEL 58, మజ్గాన్ డాక్ 91 ర్యాంకుల్లో నిలిచాయని SIPRI నివేదిక పేర్కొంది. ప్రపంచ ఉద్రిక్తతలతో 2024లో జాబితాలోని 77 కంపెనీల ఆదాయం పెరిగినట్లు తెలిపింది. కాగా ఇండియా ఆయుధ విక్రయాలు 8.2% పెరిగి $7.5B ఆదాయం సమకూరింది. ఆయుధ ఆదాయంలో 49% వాటా USదే. చైనా 13%, UK 7.7%, రష్యా 4.6% ఇండియా 1.1% వాటా కలిగి ఉన్నాయి.


