News January 10, 2025
‘స్వలింగ వివాహాల’పై తీర్పు కరెక్టే: సుప్రీంకోర్టు

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత నిరాకరిస్తూ తామిచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ తీర్పులో ఎలాంటి తప్పు కనిపించనందున జోక్యం అవసరం లేదని భావిస్తున్నట్లు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ప్రత్యేక వివాహాల చట్టం కింద స్వలింగ వివాహాలకు రక్షణ కల్పించడం సాధ్యం కాదని 2023 అక్టోబర్‌లో జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News January 28, 2026
నాకేమీ మతిమరుపు లేదు: ట్రంప్

ఇటీవల చేతికి గాయంతో <<18941717>>కనిపించిన<<>> US అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తడబడ్డారు. తన కుటుంబ ఆరోగ్య చరిత్రను చెబుతూ ‘అల్జీమర్స్’ పేరును మరచిపోయారు. ‘నా తండ్రికి ఆరోగ్య సమస్యలేవీ లేవు. ఆ ఒక్కటి తప్ప. అదేంటి’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్‌ను అడిగారు. అల్జీమర్స్ అని ఆమె బదులివ్వడంతో ‘అది నాకు లేదు. నా ఆరోగ్యం చాలా బాగుంది. వంశపారంపర్యంగా వస్తుందనే ఆందోళన కూడా లేదు’ అని చెప్పారు.
News January 28, 2026
బాబాయ్‌తో విభేదించి.. పార్టీని చీల్చి..

తన బాబాయ్, NCP అధినేత శరద్ పవార్ నిర్ణయానికి వ్యతిరేకంగా 2019 NOVలో అజిత్ పవార్ BJPతో కలిశారు. ఫడణవీస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, Dy.CMగా ప్రమాణం చేశారు. కానీ వారానికే సొంతగూటికి చేరారు. 2023 జులైలో మరోసారి తన వర్గంతో వెళ్లి BJPతో పొత్తు పెట్టుకున్నారు. కుటుంబం, పార్టీ విచ్ఛిన్నానికి ఇది కారణమైంది. మూడేళ్లకు ఇటీవల స్థానిక ఎన్నికల్లో <<18701129>>బాబాయ్, అబ్బాయ్<<>> ఒక్కటయ్యారు. ఇంతలోనే ఘోరం జరిగింది.
News January 28, 2026
వరి చిరు పొట్ట దశలో పొటాష్ వేస్తున్నారా?

వరి సాగులో ఎరువుల యాజమాన్యం ముఖ్యం. సరైన సమయంలో పంటకు అవసరమైన ఎరువులు, పోషకాలు అందించాలి. తెలుగు రాష్ట్రాలలో తేలిక భూములే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వరి చిరు పొట్ట దశలో ఎకరాకు 35 నుంచి 40 కిలోల యూరియాతో పాటు 20 నుంచి 25 కిలోల పొటాష్ ఎరువును వాడటం మంచిది. ఈ దశలో పొటాష్ వాడకం వల్ల వెన్నులో గింజ నాణ్యంగా ఉండి.. తాలు గింజలు ఏర్పడవు. దీని వల్ల అధిక దిగుబడులకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


