News July 19, 2024

గవర్నర్లకు నేర విచారణ నుంచి రక్షణపై.. సుప్రీం కీలక నిర్ణయం

image

బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాధితురాలి పిటిషన్ మేరకు నేర విచారణ నుంచి గవర్నర్‌కు మినహాయింపునిచ్చే ఆర్టికల్ 361 నిబంధనను పరిశీలించేందుకు అంగీకరించింది. దీని కింద రాష్ట్రపతి/గవర్నర్ తన పవర్స్, విధుల విషయంలో ఎవరికీ జవాబుదారీగా ఉండరు. కాగా గవర్నర్ ఆనంద బోస్ లైంగికంగా వేధించారంటూ అక్కడి రాజ్‌భవన్‌లో పని చేసే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News October 15, 2025

ఢిల్లీకి సంజూ? KKRకు కేఎల్ రాహుల్?

image

సంజూ శాంసన్‌ను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తిగా ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. అక్షర్ స్థానంలో శాంసన్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. సంజూకు బదులు ఏ ప్లేయర్‌ను RRకు ట్రేడ్ చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు టాక్. ఇక ఢిల్లీ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కోసం KKR ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ఆయనకు కెప్టెన్సీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

News October 15, 2025

సిరి సంపదలకు పునాది ‘వాస్తు’

image

వాస్తు బాగున్న ఇంట్లో నివసిస్తే వారికి సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘మంచి వాస్తు వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రభావవంతమైన ఆలోచనలు వస్తాయి. అవి అవకాశాలను సృష్టిస్తాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. దీంతో మన జీవితంలో సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పడతాయి. ఇవే అంతిమంగా మనకు ఆనందాన్ని, సంతృప్తిని అందిస్తాయి. వాస్తే మన సౌభాగ్యానికి తొలి మెట్టు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News October 15, 2025

విప్లవం లేదు గిప్లవం లేదు: సీఎం మార్పుపై సిద్దరామయ్య

image

కర్ణాటక కాంగ్రెస్‌లో CM మార్పు అంశం నెలలో ఒక్కసారైనా తెరపైకి రావడం సర్వ సాధారణమైంది. ఇటీవల రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవంబర్‌లో విప్లవం (క్రాంతి) రాబోతోందని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్యను ఓ విలేకరి ప్రశ్నించగా ‘క్రాంతి లేదు భ్రాంతి లేదు’ అని కొట్టిపారేశారు. తానే సీఎంగా కొనసాగుతానని పునరుద్ఘాటించారు. నాయకత్వ మార్పుపై వచ్చేవన్నీ అసత్యాలేనని స్పష్టం చేశారు.