News May 16, 2024
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం మార్గదర్శకాలు
ఏపీలో ఇసుక తవ్వకాలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘కేంద్ర పర్యావరణ శాఖ తరచూ తనిఖీలు చేపట్టాలి. ఆ సమాచారం రాష్ట్ర అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మైనింగ్ ప్రదేశాల్లో కలెక్టర్లు తనిఖీ చేయాలి. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’ అని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 15కి వాయిదా వేసింది.
Similar News
News January 11, 2025
బాధితులకు రేపు పరిహారం: బీఆర్ నాయుడు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలు, గాయపడ్డ బాధితులకు రేపటి నుంచి టీటీడీ పరిహారం అందించనుంది. టీటీడీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, భాను ప్రకాశ్ రెడ్డి APలో.. మిగతా వారు తమిళనాడు, కేరళలో పర్యటించి పరిహారం అందిస్తారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.2లక్షలు ఇస్తారు.
News January 11, 2025
మా కార్యకర్తల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం: కేటీఆర్
యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయంపైన జరిగిన దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అది కాంగ్రెస్ గూండాల దాడి అని ఆరోపించారు. ‘మా పార్టీ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ గూండారాజ్యం నడుస్తోంది. ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. దాడికి పాల్పడిన గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలి’ అని ట్విటర్లో డిమాండ్ చేశారు.
News January 11, 2025
ప్రముఖ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్
ప్రముఖ హిందీ నటుడు, కమెడియన్ టీకూ తల్సానియా(70) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు భార్య దీప్తి వెల్లడించారు. ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు గుండెపోటు అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. 1986లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టీకూ దాదాపు 200 చిత్రాలు, 11 సీరియళ్లలో కీలక పాత్రలు పోషించారు. ఆయన కూతురు శిఖ కూడా సత్యప్రేమ్ కీ కథ, వీర్ దీ వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించారు.