News October 3, 2024
లడ్డూ వివాదంపై నేడు సుప్రీం విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

AP: తిరుమల లడ్డూ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ను కొనసాగించాలా?లేదా స్వతంత్ర సంస్థను నియమించాలా? అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ తన అభిప్రాయాన్ని ధర్మాసనానికి చెప్పనున్నారు. దీన్నిబట్టి న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. గత విచారణలో సీఎం చంద్రబాబుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 9, 2025
MLAపై రేప్ కేసు.. AUSకు జంప్.. మళ్లీ ఆన్లైన్లో..!

రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ ఆప్ MLA హర్మిత్ సింగ్ ఆస్ట్రేలియాకు పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. తనకు బెయిల్ వచ్చిన తర్వాతే తిరిగొస్తానని తాజాగా ఆన్లైన్ వేదికగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 2న పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న హర్మిత్ అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. తనను ఫేక్ ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో పారిపోయినట్లు ప్రచారం జరిగింది.
News November 9, 2025
బాధపడొద్దు.. తెల్ల జుట్టు మంచిదే : సైంటిస్ట్‌లు

జుట్టు తెల్లబడటం మంచిదే అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. శరీరంలో క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను నాశనం చేసే ప్రాసెస్‌లో జుట్టు రంగు కోల్పోతుందని చెబుతున్నారు. మెలనోసైట్ సెల్స్ కారణంగా జుట్టు నల్లగా ఉంటుందని, ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడే ఈ కణాలు జుట్టుకు రంగును అందిస్తాయని అంటున్నారు. శరీరంలో క్యాన్సర్‌గా మారే కణాలను అంతం చేసే ప్రక్రియలో మెలనోసైట్స్ తమను తాము చంపుకుంటాయని స్పష్టం చేస్తున్నారు.
News November 9, 2025
వైస్ కెప్టెన్సీ వల్లే T20 జట్టులో గిల్?

బ్యాటింగ్‌లో విఫలమవుతున్నా గిల్‌కు T20 జట్టులో చోటు కల్పిస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్‌గా ఉన్నందునే జట్టులో ఉంచుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జైస్వాల్, సంజూ మంచి ఫామ్‌లో ఉన్నా గిల్ కోసం వారిని బెంచ్‌కే పరిమితం చేస్తున్నారని అంటున్నారు. 19 T20ల్లో 136SRతో గిల్ 502రన్స్ చేశారు. అటు జైస్వాల్ 6 T20ల్లో 170SRతో 221, సంజూ 13 T20ల్లో 182SRతో 417 పరుగులు చేశారు.


