News November 25, 2024
భూకేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం తీర్పు

TG: జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు కాగా, సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.
Similar News
News November 28, 2025
వైకుంఠ ద్వార దర్శనం: టికెట్లు ఇలా బుక్ చేయండి

TTD అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి మొదటి 3 రోజులకు (DEC 31, 31, JAN 1) టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వాట్సప్ నంబర్ 9552300009కి HI లేదా GOVINDA అని మెసేజ్ చేసి, వివరాలు ఇవ్వడం ద్వారా కూడా టికెట్లు బుక్ అవుతాయి. ఒక నంబర్‌తో గరిష్ఠంగా నలుగురికి బుక్ చేసుకోవచ్చు. DEC 1 వరకు ఛాన్సుంది. ఆ తర్వాత టికెట్లను లక్కీ డిప్ తీస్తారు. ఎంపికైన వారికి మొదటి 3 రోజుల్లో ఉచిత దర్శన భాగ్యం దక్కుతుంది.
News November 28, 2025
మరోసారి మెగా పీటీఎం

AP: మరోసారి మెగా పేరెంట్-టీచర్స్ మీట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. DEC 5న జూనియర్ కాలేజీలతో పాటు 45వేల ప్రభుత్వ బడుల్లో ఈ ప్రోగ్రాం జరగనుంది. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి తల్లిదండ్రులతో క్లాస్ టీచర్ మాట్లాడనున్నారు. మంత్రి లోకేశ్ మన్యం జిల్లాలో నిర్వహించే మెగా పీటీఎంలో పాల్గొంటారు. గతేడాది మొదటిసారి, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రెండోది, వచ్చే నెల మూడో మెగా పీటీఎం జరగనుంది.
News November 28, 2025
వైకుంఠ ద్వార దర్శనం: లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వకపోతే..?

వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఉంటుంది. అందులో మొదటి 3 రోజులు మాత్రమే లక్కీ డిప్ ద్వారా భక్తులను ఎంపిక చేస్తారు. లక్కీ డిప్లో సెలక్ట్ అవ్వని భక్తులకు నిరాశ అనవసరం. JAN 2 – JAN 8వ వరకు రోజుకు 15K చొప్పున విడుదలయ్యే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వీటిని బుక్ చేసుకున్న అందరికీ వైకుంఠ ద్వారం గుండా దర్శనం లభిస్తుంది. ఇవి DEC 5న విడుదలవుతాయి. ఫాస్ట్‌గా బుక్ చేసుకోవాలి.


