News December 2, 2024
జగన్ ఆస్తుల కేసులపై సుప్రీం కీలక ఆదేశం

ఏపీ మాజీ CM జగన్ ఆస్తులపై ఉన్న కేసులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్లను వివరించాలంది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు చార్ట్ రూపంలో అందించాలని ధర్మాసనం తెలిపింది. అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఆదేశించింది.
Similar News
News December 19, 2025
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) 11 డొమైన్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. జీతం నెలకు రూ.60,000-రూ.70,000వరకు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.ugc.gov.in
News December 19, 2025
వరద జలాలపై హక్కు ఏపీదే: రామానాయుడు

ఏటా 4వేల TMCల గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని మంత్రి రామానాయుడు ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. ‘వరద జలాలపై హక్కు కింది రాష్ట్రంగా APకే ఉంటుంది. పోలవరంపై 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా రద్దు చేయాలి. కెనాల్ల సామర్థ్యం 17వేల క్యూసెక్కులకు పెంచి ఆ అదనపు వ్యయాన్ని ప్రాజెక్టు ఖర్చులో చేర్చాలి. గోదావరి జలాలపై ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి’ అని కేంద్రాన్ని కోరారు.
News December 19, 2025
ఆసీస్ భారీ ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు మరో ఓటమి తప్పదా?

యాషెస్ సిరీస్ మూడో టెస్టులో భారీ ఆధిక్యం దిశగా ఆస్ట్రేలియా దూసుకుపోతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 271-4 పరుగులు చేసింది. ప్రస్తుతం 356 పరుగుల లీడ్‌లో ఉంది. ట్రావిస్ హెడ్ (142), అలెక్స్ కేరీ(52) క్రీజులో ఉన్నారు. జోష్ టంగ్ 2, విల్ జాక్స్, కార్స్ తలో వికెట్ తీశారు. ఇంకా రెండు రోజుల ఆట ఉండటంతో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం నిర్దేశించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ ఇప్పటికే వరుసగా 2 టెస్టులు ఓడింది.


