News March 19, 2024

శరద్ పవార్ వర్గానికి సుప్రీం కీలక ఆదేశాలు

image

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో శరద్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎన్సీపీ-శరద్ చంద్ర పవార్’ అనే పార్టీ పేరును, ‘బాకా ఊదుతోన్న వ్యక్తి’ గుర్తును ఉపయోగించేందుకు అనుమతించింది. వీటిని గుర్తించాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లను ఆదేశించింది. ఈ పేరు, గుర్తును ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వాడొద్దని సూచించింది.

Similar News

News October 14, 2025

హోమ్ లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్

image

రిజర్వ్ బ్యాంక్ రెపో <<17882889>>రేట్‌ను<<>> 5.50శాతంగా కొనసాగించడంతో HDFC, BOB, ఇండియన్ బ్యాంక్, IDBI బ్యాంకు MCLR రేట్లను తగ్గించాయి. దీంతో ఆయా బ్యాంకుల్లో హోమ్ లోన్లపై EMI తగ్గింది. టెన్యూర్‌ను బట్టి BOBలో కనిష్ఠంగా 7.85శాతం, గరిష్ఠంగా 8.75శాతం, IDBIలో 8-9.70శాతం, ఇండియన్ బ్యాంక్‌లో 7.95-8.85శాతం, HDFCలో 8.4-8.65 శాతం వరకు లోన్లు లభిస్తున్నాయి. తగ్గించిన వడ్డీరేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

News October 14, 2025

పశువుల్లో వ్యాధులు.. మందుల కొరతతో ఇబ్బందులు

image

AP: గత 2,3 వారాలుగా కురుస్తున్న వర్షాల వల్ల పాడిపశువులు, మేకలు, గొర్రెల్లో వ్యాధుల తీవ్రత పెరిగింది. గిట్టల మధ్య, మూతి దగ్గర పుండ్లు, గొంతువాపు లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటి నివారణకు ఇవ్వాల్సిన మందులు స్థానిక పశువైద్యశాలల్లో లేవని.. పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆరోపించింది. వాటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించింది.

News October 14, 2025

విశాఖలో మొట్టమొదటి గూగుల్ AI హబ్: సుందర్

image

డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటన చేశారు. ‘విశాఖపట్నంలో తొలి ఏఐ హబ్‌‌కు సంబంధించిన ప్రణాళికపై ప్రధాని మోదీతో మాట్లాడా. ఈ ఏఐ హబ్ కీలక మైలురాయి కానుంది. ఈ కేంద్రంలో గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఇంటర్నేషనల్ సబ్‌సీ గేట్‌వే & భారీ స్థాయి ఇంధన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. దీనిద్వారా AI ఆవిష్కరణలు వేగవంతం చేస్తాం.’ అని Xలో పేర్కొన్నారు.