News July 16, 2024
పవర్ కమిషన్ విచారణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: KTR

TG: పవర్ కమిషన్ ఛైర్మన్ను మార్చాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కమిషన్ పారదర్శకంగా విచారణ చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తోందని, ఇప్పటికైనా కమిషన్ల పేరుతో కాలయాపన మానుకోవాలని సూచించారు.
Similar News
News January 6, 2026
RCFLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (<
News January 6, 2026
మిరపలో ఈ సేద్య విధానం ఆదర్శం

మిరప సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు కొందరు రైతులు. సేంద్రియ కషాయాల వాడకంతో పాటు బంతి, ఆముదం మొక్కలను మిరపలో పెంచి చీడల ఉద్ధృతిని తగ్గిస్తున్నారు. పంటకు హాని చేసే పురుగుల తీవ్రతను తగ్గించడానికి జిగురు అట్టలు, సోలార్ ట్రాప్స్ వాడుతున్నారు. వీడ్ కంట్రోల్ మ్యాట్స్ వాడి కలుపును అరికడుతున్నారు. ఇలా రసాయనాలు లేకుండానే అధిక దిగుబడి సాధిస్తున్నారు.
News January 6, 2026
27 రైళ్లకు స్పెషల్ హాల్ట్లు

TG: సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే తగు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 7-20 వరకు మొత్తం 27 ఎక్స్ప్రెస్ రైళ్లకు స్పెషల్ హాల్ట్లు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి నడిచే 16 రైళ్లు హైటెక్ సిటీ స్టేషన్లో ఆగనున్నాయి. అలాగే సికింద్రాబాద్-విజయవాడ మార్గంలోని 11 రైళ్లకు చర్లపల్లి స్టేషన్లో హాల్ట్ ఏర్పాటు చేశారు. దీంతో IT ఉద్యోగులు, నగర ప్రయాణికులకు ఊరట లభించనుంది.


