News April 4, 2024
MP నవనీత్ కేసులో నేడు సుప్రీం తీర్పు

మహారాష్ట్రలోని అమరావతి MP నవనీత్ రాణా క్యాస్ట్ సర్టిఫికెట్ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆమె 2019లో SC కేటగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే, ఆమె SC సర్టిఫికెట్ను చట్టవిరుద్ధంగా పొందారనే కారణంతో దాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా.. రాణా ఇటీవలే BJPలో చేరారు. ఈ ఎన్నికల్లో అమరావతి నుంచి పోటీలో ఉన్నారు.
Similar News
News April 22, 2025
మతిమరుపు ఎక్కువవుతోందా.. కారణం అదే కావొచ్చు!

శరీరానికి సరిపడా మోతాదులో విటమిన్-కె అందనివారిలో మతిమరుపు సమస్యలు ఎక్కువవుతాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘దెబ్బ తగిలిన చోట రక్తాన్ని గడ్డ కట్టించడం నుంచి ఎముకలు, మెదడు ఆరోగ్యం వరకు విటమిన్-కె చాలా కీలకం. ఆకుకూరల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. చురుకుగా ఆలోచించడానికి, మెరుగైన జ్ఞాపకశక్తికి పాలకూర, బ్రకోలీ, క్యాబేజీ, పాలు, గుడ్లు, పళ్లు వంటివి పుష్కలంగా తీసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News April 22, 2025
మామిడి కృత్రిమ పక్వానికి ఇది వాడండి

మామిడి కృత్రిమ పక్వానికి నిషేధిత పదార్థాలు కాకుండా ఎథెఫోన్ను ఉపయోగించాలని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. 10కేజీల మామిడికి 500mg ఎథెఫోన్ వాడాలని చెబుతున్నారు. ముందుగా ఎథెఫోన్ సాచెట్ను నీటిలో నానబెట్టి, చిన్న ప్లాస్టిక్ పెట్టెలో ఉంచాలి. ఆ తర్వాత పండ్ల పెట్టెను గాలి చొరబడకుండా ఉంచి ఎథెఫోన్ సాచెట్ ఉన్న బాక్స్ను 24 గంటల పాటు ఉంచాలని చెబుతున్నారు.
News April 22, 2025
మామిడి పక్వానికి కార్బైడ్ వాడొద్దు: మంత్రి

TG: మామిడిపండ్లను కృత్రిమంగా మాగ బెట్టేందుకు కార్బైడ్ వంటి నిషేధిత పదార్థాలను ఉపయోగించవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. నిషేధిత పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై అవెర్నెస్ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. అవసరమైతే ఎథెఫోన్ను ఉపయోగించాలని ఫుడ్ సెఫ్టీ అధికారులు సూచించారు. నిషేధిత పదార్థాలు వాడినట్లు గుర్తిస్తే 9100105795 నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు.