News June 1, 2024
ప‘వార్’లో సుప్రియాదే పైచేయి!
మహారాష్ట్రలోని బారామతిలో సుప్రియా సూలే తన వదిన సునేత్రా పవార్‌పై గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. శరద్ పవార్ వర్గంలోని NCP నుంచి సుప్రియ పోటీ చేయగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని NCP నుంచి సునేత్రా బరిలోకి దిగారు. గతంలో శరద్ పవార్ చేతుల్లో ఉన్న NCPని అజిత్ పవార్ హస్తగతం చేసుకోగా.. ఎన్నికల సంఘం కూడా అజిత్‌కే మద్దతిచ్చింది. దీంతో సుప్రియా, సునేత్రా మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
Similar News
News January 21, 2025
WEF: నేడు ఈ సంస్థలతో సీఎం రేవంత్ చర్చలు
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రెండో రోజున CM రేవంత్ పలు కంపెనీలతో పెట్టుబడులపై చర్చించనున్నారు. అమెజాన్, యుని లివర్, స్కై రూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరుపుతారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. IT, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
News January 21, 2025
పలువురు మావోయిస్టు కీలక నేతలు మృతి?
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన <<15211460>>ఎన్‌కౌంటర్‌లో <<>>14 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నట్లు సమాచారం. చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి చిత్తూరు వాసి కాగా, ఆయనపై గతంలోనే రూ.కోటి రివార్డు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో రెండ్రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
News January 21, 2025
GOOD NEWS.. జీతాలు పెంపు
TG: సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులు, స్వీపర్ల జీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మండల లెవల్ స్టాక్ పాయింట్లు, GCC పాయింట్ల వద్ద పనిచేస్తున్న హమాలీలకు క్వింటాల్‌కు ప్రస్తుతం ఇస్తున్న రూ.26 ఛార్జీకి రూ.3 అదనంగా, గోదాముల్లో పనిచేసే స్వీపర్లకు వేతనం రూ.1000 పెంచింది. ఇకపై వారు రూ.6000 జీతం అందుకోనున్నారు. అలాగే హమాలీ డ్రెస్సు స్టిచ్చింగ్ ఛార్జీలు రూ.1300 నుంచి రూ.1600కు పెంచినట్లు జీవోలో పేర్కొంది.