News August 24, 2025

ఇవాళ సురవరం అంతిమయాత్ర..

image

TG: సీపీఐ సీనియర్ నేత <<17490970>>సురవరం<<>> సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ఇవాళ HYDలో జరగనుంది. ఉదయం 9 గంటలకు ఆయన భౌతికకాయాన్ని హిమాయత్ నగర్‌లోని మఖ్ధూం భవన్‌(CPI ఆఫీసు)కు తరలించనున్నారు. ఉ.10-మ.3 గంటల వరకు ప్రజా సందర్శనకు ఉంచుతారు. CM రేవంత్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఇతర నేతలు నివాళి అర్పించనున్నారు. అనంతరం అధికారిక లాంఛనాలతో ర్యాలీగా తీసుకెళ్లి గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధన కోసం భౌతికకాయాన్ని అప్పగించనున్నారు.

Similar News

News August 24, 2025

తుర్కియే, అజర్‌బైజాన్‌ దేశాలకు షాకిచ్చిన ఇండియన్స్

image

‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చిన తుర్కియేకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. గత 3 నెలల్లో భారత పర్యాటకుల సంఖ్య 50% తగ్గింది. ఈ ఏడాది మేలో 31,659 మంది ఇండియన్స్ ఆ దేశంలో పర్యటించగా, జులైలో ఆ సంఖ్య 16,244కి తగ్గింది. ‘ఆపరేషన్ సిందూర్’లో తుర్కియేకు చెందిన డ్రోన్లను పాక్ ఉపయోగించింది. అటు పాక్‌కు సపోర్ట్ చేసిన అజర్‌బైజాన్‌లోనూ భారత పర్యాటకుల సంఖ్య గతేడాది జూన్‌తో పోలిస్తే 60% తగ్గింది.

News August 24, 2025

ఎల్లుండి నుంచి స్పాట్ అడ్మిషన్లు

image

TG: JNTUతో పాటు అనుబంధ కాలేజీల్లో మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్లకు ఈ నెల 26 నుంచి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. 26న వర్సిటీ క్యాంపస్, సుల్తాన్‌పూర్, 28న జగిత్యాల, మంథని, 29న వనపర్తి, సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్ కాలేజీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆయా కాలేజీల్లో సీట్లు కావాల్సిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని అధికారులు సూచించారు.

News August 24, 2025

గుడ్డులోని పచ్చసొన తినట్లేదా?

image

కోడిగుడ్డులోని పచ్చసొన మంచిది కాదని కొందరు దాన్ని దూరం పెడతారు. అయితే ఎగ్ ఎల్లోతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని ICMR తెలిపింది. అందులోని విటమిన్ B12, D, A, ఐరన్, ఒమెగా-3 అనే హెల్తీ ఫ్యాట్స్‌తో శరీరానికి పోషకాలు అందుతాయి. Lutein, Zeaxanthin కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొలిన్ వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. రోజుకు రెండు గుడ్లు (ఎల్లోతో సహా) తినాలని వైద్యులు సూచిస్తున్నారు.