News October 3, 2024

సురేఖ చౌకబారు వ్యాఖ్యలను ఖండిస్తున్నా: మహేశ్

image

సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో మహేశ్‌బాబు స్పందించారు. ‘ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యా. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్‌స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్‌గా అభ్యర్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 20, 2025

ప్రపంచంలో స్త్రీని చూడని ఏకైక పురుషుడు!

image

స్త్రీ, పురుషులు ఒకరి ముఖం ఒకరు చూడకుండా ఉంటారా? కానీ గ్రీస్‌కు చెందిన ఓ వ్యక్తి తన 82ఏళ్ల జీవితంలో ఒక్కసారి కూడా స్త్రీ ముఖం చూడలేదు. మిహైలో టొలోటోస్ అనే సన్యాసి 1856లో జన్మించగా.. పుట్టిన 4 గంటల్లోనే తల్లి చనిపోయింది. దీంతో అతడిని సన్యాసులు స్త్రీలకు ప్రవేశం లేని మౌంట్ అథోస్‌కు తీసుకెళ్లారు. కారు, విమానం వంటి ఆధునిక ప్రపంచపు ఆనవాళ్లు కూడా ఆయనకు తెలియవు. జీవితాంతం ప్రార్థనలతో గడిపారు.

News December 20, 2025

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న సూర్య!

image

సూర్య కుమార్ యాదవ్ టీమ్ ఇండియా T20I కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించనున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ ముగిశాక కెప్టెన్‌గా ఆయన తప్పుకుంటారని INDIA TODAY కథనం పేర్కొంది. కొంత కాలంగా తన ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడమే దీనికి కారణమని వెల్లడించింది. ఫిబ్రవరి 7నుంచి WC మొదలుకానున్న సంగతి తెలిసిందే.

News December 19, 2025

రాత్రుళ్లు వచ్చే హార్ట్ అటాక్స్ తక్కువ ప్రమాదకరమా?

image

రాత్రుళ్లు వచ్చే హార్ట్ అటాక్‌లు తక్కువ ప్రమాదకరమని తాజా స్టడీలో వెల్లడైంది. డేటైమ్‌లో న్యూట్రోఫిల్స్ యాక్టివ్‌గా ఉండడంతో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి గుండెకు నష్టం ఎక్కువ జరుగుతున్నట్టు గుండెపోటుకు గురైన 2వేల మంది రికార్డులు పరిశీలించి గుర్తించారు. CXCR4 రిసెప్టర్లు పెంచి న్యూట్రోఫిల్స్ కదలికలను నియంత్రించే పరిశోధనలను ఎలుకలపై చేపట్టారు. న్యూట్రోఫిల్స్‌ తీవ్రతను తగ్గించే మందుల తయారీపై దృష్టిపెడుతున్నారు.