News October 2, 2024
నా డివోర్స్ వెనుక రాజకీయ కుట్ర లేదు: సమంత

తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. ‘మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు. ఇక విడాకులనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అది ఇద్దరి అంగీకారంతో, ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగింది. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరం పెట్టండి’ అని ఓ ప్రకటనలో సూచించారు.
Similar News
News January 28, 2026
వంటింటి చిట్కాలు మీకోసం

* నిమ్మరసం మిగిలిపోతే అందులో కొద్దిగా ఉప్పు వేసి ఫ్రిజ్‌లో ఉంచితే మరో 2 రోజులు వాడుకోవచ్చు. * నీళ్ళలో పచ్చిపాలు కలిపి వెండి సామగ్రి కడిగితే మురికి వదిలిపోయి శుభ్రపడతాయి. * బెండకాయ కూరలో కాస్త పెరుగు/ నిమ్మరసం జోడిస్తే జిగురు రాకుండా ఉంటుంది. * పిండిలో పావుకప్పు వేయించిన సేమియా వేస్తే గారెలు మరింత రుచిగా ఉంటాయి. *అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే చక్కగా వేగుతాయి.
News January 28, 2026
నాకేమీ మతిమరుపు లేదు: ట్రంప్

ఇటీవల చేతికి గాయంతో <<18941717>>కనిపించిన<<>> US అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తడబడ్డారు. తన కుటుంబ ఆరోగ్య చరిత్రను చెబుతూ ‘అల్జీమర్స్’ పేరును మరచిపోయారు. ‘నా తండ్రికి ఆరోగ్య సమస్యలేవీ లేవు. ఆ ఒక్కటి తప్ప. అదేంటి’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్‌ను అడిగారు. అల్జీమర్స్ అని ఆమె బదులివ్వడంతో ‘అది నాకు లేదు. నా ఆరోగ్యం చాలా బాగుంది. వంశపారంపర్యంగా వస్తుందనే ఆందోళన కూడా లేదు’ అని చెప్పారు.
News January 28, 2026
బాబాయ్‌తో విభేదించి.. పార్టీని చీల్చి..

తన బాబాయ్, NCP అధినేత శరద్ పవార్ నిర్ణయానికి వ్యతిరేకంగా 2019 NOVలో అజిత్ పవార్ BJPతో కలిశారు. ఫడణవీస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, Dy.CMగా ప్రమాణం చేశారు. కానీ వారానికే సొంతగూటికి చేరారు. 2023 జులైలో మరోసారి తన వర్గంతో వెళ్లి BJPతో పొత్తు పెట్టుకున్నారు. కుటుంబం, పార్టీ విచ్ఛిన్నానికి ఇది కారణమైంది. మూడేళ్లకు ఇటీవల స్థానిక ఎన్నికల్లో <<18701129>>బాబాయ్, అబ్బాయ్<<>> ఒక్కటయ్యారు. ఇంతలోనే ఘోరం జరిగింది.


