News October 2, 2024

సురేఖ క్షమాపణలు చెప్పాలన్న హరీశ్.. కాదు కేటీఆరే చెప్పాలన్న జగ్గారెడ్డి

image

TG: KTRపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘వాళ్లు మిమ్మల్ని వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారంటే, పొలిటికల్‌గా ఆర్గ్యుమెంట్లు లేవని అర్థం-మార్గరెట్ థాచెర్’ అనే కోట్‌ను ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు కేటీఆర్‌ను సురేఖ తిట్టడం తప్పుకాదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. KTR వెంటనే సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 20, 2025

పోలి పాడ్యమి కథ అందిస్తున్న సందేశాలివే..

image

☞ భగవంతుడికి కావాల్సింది ఆడంబరం కాదు, పోలి వలె నిజాయితీ, తపనతో కూడిన శ్రద్ధ మాత్రమే.
☞ అహంకారం పతనానికి దారి తీస్తుందని అత్తగారి ఉదంతం హెచ్చరిస్తుంది. అహంకారంతో చేసే పూజలు నిష్ప్రయోజనం.
☞ సంకల్ప శక్తి ముఖ్యం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ధర్మాన్ని పాటించాలనే మనసు ఉంటే మార్గం దానంతట అదే దొరుకుతుంది.
☞ కుటుంబ సఖ్యత కోసం అసూయ, కంటగింపులను విడిచిపెట్టాలని ఈ కథ బోధిస్తుంది.

News November 20, 2025

అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

image

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.

News November 20, 2025

హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా బుధవారం రాత్రి వరకు హిడ్మా, అతని భార్య రాజేతోపాటు మరో మావోయిస్టు మృతదేహానికి మాత్రమే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. మరో ముగ్గురి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.