News December 8, 2024
అక్కినేని కుటుంబంపై సురేఖ వ్యాఖ్యలు తప్పే: టీపీసీసీ చీఫ్

TG: కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత అంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు. అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు తప్పని ఆయన అన్నారు. వెంటనే ఆమె సారీ చెప్పినట్లు గుర్తుచేశారు. ఆవిడపై సోషల్మీడియాలో జరిగిన ప్రచారమే దీనికి కారణమైందని, ఈ విషయంలో తాను చొరవ తీసుకోవడంతో వివాదం కాస్త సద్దుమణిగిందని పేర్కొన్నారు.
Similar News
News November 2, 2025
విజయవాడకు జోగి రమేశ్ తరలింపు!

AP: కల్తీ మద్యం కేసులో <<18175333>>అరెస్టైన<<>> మాజీ మంత్రి జోగి రమేశ్ను పోలీసులు విజయవాడకు తరలించారు. ఎక్సైజ్ కార్యాలయానికి ఆయనను తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అనంతరం కల్తీ మద్యం కేసులో ఆయనను విచారించనున్నారు. మరోవైపు జోగి రమేశ్ అరెస్టుతో పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు.
News November 2, 2025
ఏపీ రౌండప్

* పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులకు రెండేళ్ల సర్వీసును ఏడాదికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
* పంట నష్టం అంచనాల నమోదుకు గడువును ఈ నెల 7 వరకు పెంచాలని కౌలురైతు సంఘం డిమాండ్
* సమ్మె కాలాన్ని పనిరోజులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరిన ఏపీ పీహెచ్సీ ఉద్యోగుల సంఘం
* పన్నులు తగ్గినా రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. గత అక్టోబర్తో పోలిస్తే 8.77శాతం వృద్ధి
News November 2, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలోనూ చికెన్ ధరలు తగ్గట్లేదు. హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.210-250, కామారెడ్డిలో రూ.260, ఉమ్మడి ఖమ్మంలో రూ.210-240, విజయవాడలో రూ.250, ఏలూరులో రూ.220, విశాఖలో రూ.260గా ఉన్నాయి. కార్తీక మాసం అయినప్పటికీ ఆదివారం కావడంతో పలు ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. మీ ఏరియాలో రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.


