News September 26, 2024
సూర్య, విక్రమ్, శంకర్ కాంబోలో మూవీ?

తమిళ స్టార్ హీరోలు విక్రమ్, సూర్యతో దర్శకుడు శంకర్ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. వెల్పరి నవల ఆధారంగా మూవీని తీయనున్నట్లు కోలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. ఇదే విషయమై హీరోలతో దర్శకుడు చర్చిస్తున్నారని సమాచారం. మూవీని 3 పార్టుల్లో తీసుకొస్తారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్ ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News November 21, 2025
NZB: హమారా ‘నిఖత్’ హ్యాట్రిక్ విన్నర్

గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. నిఖత్ 51 కేజీల విభాగంలో తైవాన్ క్రీడాకారిణిపై 5-0తో గెలిచింది. దీంతో వరుసగా 3 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022, 2023, 2025 సంవత్సరాల్లో జరిగిన టోర్నీల్లో బంగారు పతకం గెలుపొందింది. 2024లో ఒలింపిక్ క్రీడల వల్ల ఎలాంటి టోర్నీలు జరగ లేదు.
News November 21, 2025
యాషెస్ సిరీస్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
☛ AUS XI: ఖవాజా, వెదరాల్డ్, లబుషేన్, స్మిత్(C), హెడ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, లియాన్, బ్రెండన్ డాగెట్, బోలాండ్
☛ ENG XI: డకెట్, క్రాలే, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్(C), J స్మిత్, అట్కిన్సన్, కార్స్, ఆర్చర్, వుడ్
☛ LIVE: స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్
News November 21, 2025
iBOMMA రవి కేసును ఫ్రీగా వాదిస్తానన్న లాయర్.. తండ్రి ఏమన్నారంటే?

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును ఉచితంగా వాదించి అతన్ని బయటకు తీసుకొస్తానంటూ సలీమ్ అనే న్యాయవాది ముందుకొచ్చారు. విశాఖ జిల్లా పెదగదిలి సాలిపేటలో ఉంటున్న రవి తండ్రి అప్పారావును ఆయన కలిశారు. కేసును వాదించేందుకు కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని కోరగా తాను నిరాకరించినట్లు అప్పారావు తెలిపారు. తన ఆరోగ్యం సహకరించనందున కోర్టుల చుట్టూ తిరగలేనని చెప్పానన్నారు.


