News August 20, 2025

రేపు చిరు అభిమానులకు సర్‌ప్రైజ్

image

ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్‌ డే కాగా, ఒక రోజు ముందుగానే అభిమానులకు అదిరిపోయే న్యూస్ రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగా157 నుంచి రేపు సాయంత్రం అప్డేట్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం.

Similar News

News August 20, 2025

ప్రియుడిని పెళ్లి చేసుకున్న ‘జేజమ్మ’

image

‘అరుంధతి’లో చిన్ననాటి జేజమ్మగా నటించిన దివ్య నగేశ్ పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ అజిత్ కుమార్‌తో ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ అమ్మడు ఈ నెల 18న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. సింగం పులి, అపరిచితుడు చిత్రాల్లో దివ్య నటించారు. అరుంధతిలో నటనకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నారు.

News August 20, 2025

పెన్షన్లు.. వారికి మరో అవకాశం

image

AP: పెన్షన్‌కు <<17398848>>అనర్హులుగా<<>> నోటీసులు అందుకున్న దివ్యాంగులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. తాము పెన్షన్‌కు అర్హులమని భావించే వారు వెంటనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు. అర్హుల గుర్తింపులో అక్రమాలు జరిగాయని, నోటీసులు అందుకున్నవారు సదరం శిబిరాల్లో మరోసారి వైకల్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

News August 20, 2025

ఆ బిల్లు ఆపండి: అమిత్‌ షాకు AIGF లేఖ

image

బెట్టింగ్‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం తెచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ <<17459059>>బిల్లును<<>> ఆపాలని హోంమంత్రి అమిత్ షాకు ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్(AIGF) లేఖ రాసింది. దీని వల్ల గేమింగ్ సెక్టార్‌‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. కోట్లాది మంది గేమర్లు ఇల్లీగల్ గ్యాంబ్లర్లుగా మారే ప్రమాదముందని తెలిపింది. ఒకేసారి బ్యాన్ చేయకుండా క్రమంగా నియంత్రించాలని సూచించింది. కాగా దేశంలో గేమింగ్ సెక్టార్ విలువ ₹2లక్షల కోట్లు.