News August 17, 2025
సరోగసి కేసు: మరిన్ని ఆసుపత్రులకు నోటీసులు

TG: <<17423890>>సరోగసి<<>> కేసులో నిందితురాలు లక్ష్మి పలు ఆసుపత్రులకు ఏజెంట్‌గా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో హెగ్డే, లక్స్ ఆసుపత్రి, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్, ఫర్టీ కేర్, అమూల్య ఫెర్టిలిటీ, శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రత నేరం అంగీకరించిన సంగతి తెలిసిందే.
Similar News
News August 17, 2025
ట్రంప్, పుతిన్ భేటీ.. గెలిచిందెవరు?

US, రష్యా ప్రెసిడెంట్స్ ట్రంప్, పుతిన్ భేటీ కావడం జియోపాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చర్చలు విఫలమైనప్పటికీ పుతిన్‌దే విజయమంటూ US మాజీ అధికారులు సైతం చెబుతున్నారు. ట్రంప్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని అంటున్నారు. కనీసం సీజ్‌ఫైర్ ప్రస్తావన కూడా తీసుకురాలేదన్నారు. మరోవైపు శత్రుదేశం రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం, ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని సమర్థించుకోవడం పుతిన్ సాధించిన విజయంగా అభివర్ణిస్తున్నారు.
News August 17, 2025
నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక భేటీ

బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ ఉదయం 9.30 గంటలకు కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడింది. అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యతలను ఎన్డీఏ వర్గాలు ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించాయి. నామినేషన్ దాఖలుకు సమయం సమీపిస్తుండటంతో ఇవాళ ప్రత్యేక భేటీ ఏర్పాటు చేశారు.
News August 17, 2025
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిపోయిన అబార్షన్లు

గత ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో అబార్షన్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. APతో పోలిస్తే TGలో దాదాపు 3 రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. APలో 367% పెరగ్గా, TGలో 917% పెరిగాయి. TGలో 2020-21లో 1578 అబార్షన్లు జరగ్గా 2024-25లో ఆ సంఖ్య ఏకంగా 16,059కి పెరిగింది. ఇదే సమయంలో APలో 10,676 కేసులు నమోదయ్యాయి. కాగా 25,884 అబార్షన్లతో కేరళ టాప్‌లో ఉంది. ఈ గణాంకాలను కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ రాజ్యసభలో సమర్పించారు.