News October 11, 2025

వారికి సరోగసీ నిబంధనలు వర్తించవు

image

సరోగసీ పేరెంట్స్ 2022 జనవరి 25కు ముందే పిండాలను శీతలీకరించే ప్రక్రియను చేపట్టి ఉంటే సరోగసీ చట్టం-2021లోని వయోపరిమితి నిబంధనలు వారికి వర్తించవని సుప్రీంకోర్టు పేర్కొంది. 2021లో రూపొందించిన చట్టం ఆ మరుసటి ఏడాది జనవరి 25 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులుగా మారాలని ఆకాంక్షిస్తున్న వివాహితుల్లో భార్య వయసు 23-50 ఏళ్ల మధ్య ఉండాలి. తండ్రి వయసు 26-55 ఏళ్ల మధ్య ఉండాలి.

Similar News

News October 11, 2025

నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు

image

AP: CM CBN సతీమణి, NTR ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కి ఎంపికయ్యారు. అపార వ్యాపార నాయకత్వం, వివిధ రంగాల్లో చేసిన సేవలకు గాను IOD ఈ అవార్డు ప్రకటించింది. లండన్లో నవంబర్ 4న జరిగే గ్లోబల్ కన్వెన్షన్లో ఈ అవార్డును ఆమె స్వీకరించనున్నారు. గతంలో ఏపీజే అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా, సంజీవ్ గోయెంకా వంటి ప్రముఖులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

News October 11, 2025

ఇతిహాసాలు క్విజ్ – 32 సమాధానాలు

image

1. రావణుడి రెండో భార్య ‘ధాన్యమాలిని’.
2. ద్రౌపది అన్న ధృష్టద్యుమ్నుడు.
3. అయ్యప్ప స్వామి వాహనం ‘పెద్ద పులి’.
4. విష్ణుమూర్తి ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించాడు.
5. అహం అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ‘నేను’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 11, 2025

తెలంగాణకు ఐకానిక్‌గా టీస్క్వేర్ నిర్మాణం: రేవంత్

image

TG: HYDలోని రాయదుర్గం సమీపంలో టీస్క్వేర్ నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందులో యాపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల ఔట్‌లెట్లు ఉండాలని చెప్పారు. తెలంగాణకు ఐకానిక్‌గా ఉండేలా NOV నెలాఖరు నుంచి పనులు ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఏఐ హబ్ కోసం ప్రముఖ AI సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.