News November 22, 2024
కోటి కుటుంబాలకు సర్వే పూర్తి

TG: రాష్ట్రవ్యాప్తంగా కోటి కుటుంబాలకు సమగ్ర ఇంటింటి సర్వే పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. ములుగు, జనగామ జిల్లాల్లో 100 శాతం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 99.9 శాతం సర్వే పూర్తయినట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.16 కోట్ల నివాసాలు గుర్తించామని, నేటి వరకు 1.01 కోట్ల నివాసాల్లో సర్వే కంప్లీట్ చేసి 87.1 శాతం సాధించామని వివరించింది.
Similar News
News January 16, 2026
గాదె ఇన్నయ్యకు 48 గంటల బెయిల్

TG: ఉపా కేసులో అరెస్టైన మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకు బెయిల్ లభించింది. తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నాంపల్లి NIA కోర్టు 48 గంటల బెయిల్ మంజూరు చేసింది. HYDలోని చంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. నిన్న రాత్రి ఇన్నయ్య తల్లి థెరిసమ్మ జనగామ జిల్లా జఫర్గఢ్లో కన్నుమూశారు. రేపు ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.
News January 16, 2026
ఈ సినిమాలన్నీ NETFLIXలోనే

షూటింగ్ దశలో ఉన్న పలు టాలీవుడ్ చిత్రాల డిజిటల్ రైట్స్ తామే సొంతం చేసుకున్నట్లు NETFLIX ట్వీట్ చేసింది. ఈ జాబితాలో రామ్ చరణ్ ‘పెద్ది’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, నాని ‘ప్యారడైజ్’, వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’, దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’, శర్వానంద్ ‘బైకర్’, విజయ్ దేవరకొండ ‘VD 14’, విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఉన్నాయి. ఈ చిత్రాలు థియేటర్లలో విడుదలై 4-8 వారాల్లో OTTలోకి వచ్చే అవకాశముంది.
News January 16, 2026
ఆదివారం పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు

ఫిబ్రవరి 1న స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయని దేశీయ ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్లు BSE, NSE ప్రకటించాయి. ఆరోజు ఆదివారం అయినప్పటికీ.. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. టైమింగ్స్(9:15 am-3:30 pm)లోనూ ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాయి. దేశ చరిత్రలో బహుశా ఇలా ఆదివారం మార్కెట్లు పనిచేయడం ఇదే తొలిసారి అయి ఉండొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


