News November 16, 2024
44 శాతం ఇళ్లలో సర్వే పూర్తి
TG: రాష్ట్రవ్యాప్తంగా 1.16 కోట్ల ఇళ్లకుగాను 51.24 లక్షల(44.1శాతం) నివాసాల్లో సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సర్వేలో 87,807 మంది సిబ్బంది పాల్గొంటున్నారని, 8,788 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సర్వే తీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రజల అభ్యున్నతి కోసమే సర్వే చేస్తున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలవాలి’ అని సూచించారు.
Similar News
News November 16, 2024
చైనాలో ‘మహారాజ’ రిలీజ్
విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటించిన రివేంజ్ డ్రామా ‘మహారాజ’ ఈ నెల 29న చైనాలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ నిథిలన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 14న విడుదలై సంచలన విజయం సాధించింది. రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ రికార్డుస్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.
News November 16, 2024
సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్యం విషమం
AP: సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు HYDకి బయల్దేరారు. మంత్రి లోకేశ్ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు.
News November 16, 2024
ప్రపంచస్థాయి మ్యూజిక్ స్కూల్‌ని ప్రారంభించడం నా కల: తమన్
ప్రపంచస్థాయి మ్యూజిక్ స్కూల్‌ను ప్రారంభించాలనేది తన కల అని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంగీత పాఠశాల నా కల. ఆర్థికంగా వెనుకబడిన వారికి అందులో ఉచితంగా సంగీతం నేర్పిస్తాను. సంగీతం ఉన్నచోట నేరాలు తక్కువగా ఉంటాయి. మరో మూడేళ్లలో మన వద్దే నిర్మిస్తాను. స్థలం ఇవ్వమని కాకుండా ప్రభుత్వాలు సాయమేమైనా చేస్తాయేమో అడుగుతాను’ అని పేర్కొన్నారు.