News October 26, 2024
‘సరస్వతి’ భూముల్లో సర్వే

AP: మాజీ CM జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూముల్లో ప్రభుత్వం సర్వే చేపట్టింది. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం మండలాల్లో ఉన్న భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. కాగా వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సరస్వతి పవర్ కంపెనీకి ఎకరా రూ.3 లక్షల చొప్పున 1,515.93 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. వీటిలో అటవీ భూములు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News January 29, 2026
జూన్‌నాటికి పేదలకు 2.61లక్షల ఇళ్లు: మంత్రి

AP: అర్హులందరికీ 2029నాటికి పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందజేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ‘జూన్‌నాటికి 2.61 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నాం. దరఖాస్తు చేసుకున్న 10లక్షల మందిలో 7.5లక్షల మంది అర్హులు ఉండొచ్చని అంచనా వేశాం. వాళ్లందరికీ 2029నాటికి శాశ్వత గృహాలు, మిగిలిన 2.5లక్షల మందికి స్థలాలు కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది’ అని మంత్రి తెలిపారు.
News January 29, 2026
వేరుశనగలో పొగాకు లద్దె పురుగు నివారణ ఎలా?

వేరుశనగలో పొగాకు లద్దె పురుగు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో నొవాల్యురాన్ 200ML లేదా ఫ్లూబెండమైడ్ 40MLను కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి మరీ ఎక్కువగా ఉంటే 10 కిలోల తవుడు, KG బెల్లం, లీటరు క్లోరిపైరిఫాస్ మందును కలిపి, తగిన నీటిని జోడించి ఉండలుగా చేసి విషపు ఎరలను తయారు చేసుకోవాలి. వీటిని సాయంత్రం వేళ సమానంగా ఒక ఎకరా పొలంలో చల్లి పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు.
News January 29, 2026
ఇంటర్ స్టూడెంట్స్‌కు యూనిఫామ్, వెల్కమ్ కిట్

TG: వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు ఇవ్వనున్నట్లు ఇంటర్మీడియట్ కమిషనరేట్ అధికారులు వెల్లడించారు. ఈ కిట్లలో తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, ఒక జత యూనిఫామ్, వర్క్ బుక్ ఉంటాయి. కాలేజీ స్టార్ట్ అయిన రోజునే వీటిని పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పరీక్షలు పూర్తయిన 15 రోజులకే క్లాసులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.


