News November 12, 2024
APలో 6 ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీపై సర్వే

APలో 6 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయనుంది. కుప్పంలో 1501 ఎకరాలు, నాగార్జునసాగర్‌లో 1670, తాడేపల్లి గూడెం-1123, శ్రీకాకుళం-1383 ఎకరాలు, తుని-అన్నవరంలో 787 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రూ.2.27 కోట్లు విడుదల చేయనుంది.
Similar News
News December 17, 2025
కేంద్ర సాయుధ బలగాల్లో 438 ఆత్మహత్యలు

కేంద్ర సాయుధ బలగాలు (CAPFs), అస్సాం రైఫిల్స్, NSGలో 2023-25 మధ్య 438మంది సైనికులు సూసైడ్ చేసుకున్నారని కేంద్రం లోక్‌సభలో తెలిపింది. అత్యధికంగా CRPFలో 159ఆత్మహత్యలు నమోదైనట్లు చెప్పింది. అటు 2014-2025 మధ్య CAPF, అస్సాం రైఫిల్స్‌లో 23,360మంది ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఇందులో BSFలో ఎక్కువ మంది 7,493మంది ఉన్నారంది. ఈ ఏడాది 3,077మంది రిజైన్ చేయగా వారిలో 1,157మంది BSF సైనికులున్నట్లు చెప్పింది.
News December 17, 2025
SRH ఫుల్ టీమ్ ఇదే!

IPL మినీ వేలంలో కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసిన తర్వాత SRH ఫుల్ టీమ్ చూసేయండి. అభిషేక్, అనికేత్ వర్మ, కార్సే, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, క్లాసెన్, ఇషాన్ కిషన్, ఉనద్కత్, కమిందు మెండిస్, నితీశ్, కమిన్స్, స్మరణ్, హెడ్, జీషన్ అన్సారి, సలీల్ అరోరా, శివంగ్ కుమార్, లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అమిత్ కుమార్, క్రైన్స్ ఫులేట్రా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, ప్రఫుల్ హింగే, శివమ్ మావి.
News December 17, 2025
డిసెంబర్ 17: చరిత్రలో ఈరోజు

* 1903: రైట్ సోదరులు తయారు చేసిన విమానం మొదటిసారి ఎగిరింది
* 1914: క్రికెట్ లెజెండ్ సయ్యద్ ముస్తాక్ అలీ జననం
* 1959: నటి జయసుధ జననం
* 1959: ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం
* 1985: నటుడు అడివి శేష్ జననం
* 1996: సినీ నటి సూర్యకాంతం మరణం(ఫొటోలో)


