News March 9, 2025
కొల్లేరు ఆక్రమణలపై సర్వే

AP: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు సరస్సు ఆక్రమణలపై అటవీశాఖ సర్వే ప్రారంభించింది. గుడివాకలంక నుంచి డ్రోన్ల సహాయంతో ఆక్రమణలను గుర్తిస్తోంది. కొల్లేరు సరస్సులో సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరమైన ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని కోర్టు ఆదేశించింది. దీంతో సరిహద్దులను గుర్తించి అక్షాంశాలు, రేఖాంశాలను అటవీ శాఖ ఖరారు చేయనుంది. ఈ సర్వేపై Dy.CM పవన్ కళ్యాణ్ ఆరా తీస్తున్నారు.
Similar News
News January 17, 2026
మేడారం మహాజాతర.. ప్రధాన ఘట్టాలు!

TG: మేడారం మహాజాతర మరో 11 రోజుల్లో ప్రారంభం కానుంది. ముఖ్య కార్యక్రమాల వివరాలు ఇలా..
* ఈ నెల 28(బుధవారం) సాయంత్రం 4 గంటలకు సారలమ్మ గద్దెకు వచ్చే సమయం
* 29(గురువారం) సాయంత్రం 5 గంటలకు సమ్మక్క గద్దెకు వచ్చే సమయం
* 30(శుక్రవారం) అమ్మవార్లకు మొక్కులు చెల్లించుట
* 31(శనివారం) సాయంత్రం 4 గంటలకు సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం
** ఈ నెల 19న సీఎం రేవంత్ గద్దెల పునరుద్ధరణ ప్రారంభోత్సవం చేస్తారు.
News January 17, 2026
మోదీ అండతో మనం మరింత ముందుకెళ్లాలి: CM

దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయని CM చంద్రబాబు తెలిపారు. ‘ఏపీకి ఉన్న అన్ని రకాల వనరులు ఉపయోగించుకుంటున్నాం. ఇటీవల రూ.8.75 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చాం. గ్రీన్ హైడ్రోజన్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ మిషన్, డేటా సెంటర్లు, రోబోటిక్స్ వస్తున్నాయి. నాలెడ్జ్ ఎకానమీలో ముందున్న వారే విజేతలు అవుతారు. PM మోదీ అండతో మనం మరింత ముందుకెళ్లాలి’ అని కాకినాడలో సూచించారు.
News January 17, 2026
H1B వీసాలు.. డాక్టర్లే ఎక్కువగా సంపాదిస్తున్నారట!

అమెరికాలో H1B వీసాలతో టెకీల కంటే మెడికల్ స్పెషలిస్టులే ఎక్కువగా సంపాదిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. కొందరు స్పెషలిస్టుల (రేడియాలజిస్టులు, కార్డియాలజిస్టులు, సర్జన్లు, న్యూరాలజిస్టులు) జీతాలు 3 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. డాక్టర్ల తర్వాత లాయర్లు, కంప్యూటర్ సిస్టమ్ మేనేజర్లు, ఫైనాన్స్ మేనేజర్లు లక్ష-2 లక్షల డాలర్లు సంపాదిస్తున్నారని తెలిపింది.


