News June 24, 2024
నేటి నుంచి మరుగుదొడ్లపై సర్వే
TG: వ్యక్తిగత మరుగుదొడ్లపై సర్వే చేయించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 100% మరుగుదొడ్లు ఉన్నాయా లేదా నిర్ధారించనుంది. లేని వారికి మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తమ పంచాయతీలకు పురస్కారాల కోసం ప్రభుత్వం ఏటా మరుగుదొడ్లపై సమాచారం సేకరిస్తోంది. దీనిలో 100% ఉన్నట్లు గణాంకాలు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్‌పై సర్వే జరుగుతోంది.
Similar News
News January 10, 2025
చైనాలో మంకీపాక్స్ కొత్త మ్యుటెంట్ కలకలం
ఇప్పటికే hMPVతో భయపెడుతున్న చైనా మరో బాంబ్ పేల్చింది. మంకీపాక్స్‌కు చెందిన కొత్త మ్యుటెంట్ డిటెక్ట్ అయిందని ప్రకటించింది. కాంగో నుంచి వచ్చిన వ్యక్తిలో దీన్ని గుర్తించామని, అతడి నుంచి మరో నలుగురికి ఇది సోకిందని చెప్పింది. కాగా గతేడాది కాంగోలో మంకీపాక్స్ విజృంభించడంతో WHO దాన్ని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. తాజాగా ఈ వైరస్ చైనాకు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది.
News January 10, 2025
ఇవాళ వైకుంఠ ఏకాదశి.. ఈ పనులు చేయొద్దు!
పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు. ఉపవాసం ఆచరించి, పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానాన్ని ముట్టరాదు. శారీరక సంబంధాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటించాలి. పగలు నిద్ర పోరాదు. రాత్రి జాగరణ చేస్తూ విష్ణు నామస్మరణ చేయాలి. తులసి అంటే విష్ణువుకు మహాప్రీతి. ఇవాళ తులసి ఆకులను కోయొద్దు. ఇతరులను బాధపెట్టేలా విమర్శలు, కఠిన మాటలు మాట్లాడొద్దు.
News January 10, 2025
నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన
AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. జాతీయ రియల్ ఎస్టేట్ మండలి ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగే ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో నిర్మాణ రంగం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై సీఎం ప్రసంగించనున్నారు. ఉదయం 11గంటలకు చంద్రబాబు గుంటూరు వస్తారని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.